Sukumar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కు ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు సుకుమార్ అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. రచయిత గా తన కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. సుక్కు దర్శకత్వం వహించిన ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పచ్చు అని సుకుమార్ ప్రూవ్ చేసి సక్సెస్ కొట్టాడు. ఇకపోతే సుకుమార్ దగ్గర పని చేసిన చాలా మంది దర్శకులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన పేరును సాధించుకుంటున్నారు. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ లానే ఉండిపోతారు. కానీ సుకుమార్ దగ్గర పని చేసిన వాళ్ళు మాత్రం డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందుతారు.
కష్టాన్ని గుర్తిస్తాడు
ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నది ఒక గుర్తింపు. పేరు గుర్తింపు కోరుకునే వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. జులాయి సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్లు “కారు అనగానే స్టీరింగ్ టైర్లు మాత్రమే కాదు పెట్రోల్ కూడా.. అది మన కంటికి కనిపించదు అది లేకపోతే బండి నడవదు”అలానే అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే సినిమా అనేది జరగదు అని కూడా చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్స్ కి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కేవలం ఒక రెండు సెకన్స్ స్క్రీన్ మీద పేరు ఇలా వచ్చే అలా వెళ్ళిపోతుంది. ఇకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ల కష్టాన్ని గుర్తించే దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుకుమార్. తన ప్రతి సినిమాకి పేరుపేరునా ప్రతి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన సినిమాకి ఎంతవరకు సహాయపడ్డారు అని చెబుతూ వస్తుంటాడు సుకుమార్.
సుకుమార్ నుంచి వచ్చిన దర్శకులు
ఇదివరకే సుకుమార్ నుంచి సూర్యప్రతాప్ పల్నాటి, శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సాన, వంటి దర్శకులు సినిమాలు చేసి ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు కాశీ అనే మరో కొత్త దర్శకుడు ఆశిష్ తో సెల్ఫీస్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ ఓ ఓటీటీ సంస్థతో కలిసి పని చేయబోతున్నాడట. ఆయన శిష్యులను డైరెక్టర్ల గా మార్చడానికి ఆ ఓటీటీతో ఒప్పందం చేసుకున్నట్టు టాక్. వాళ్లు చేసే సినిమాలన్నీ కూడా సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ పైనే ఉంటాయి. కానీ, డబ్బులు పెట్టేది మొత్తం ఆ ఓటీటీనే. అయితే, ఆ సినిమాలకు క్రియేటివ్ హెడ్ గా సుకుమార్ ఉంటాడట. క్రియేటివ్ హెడ్ మాత్రమే కాదు… ఆ సినిమాలకు అన్నీ తానై చూసుకుంటాడట. ఇప్పటి కే దాదాపు 6గురు శిష్యులు డైరెక్టర్లుగా మారారు. ఇప్పుడు సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయంతో… మరి కొంత మంది సుకుమార్ శిష్యులు డైరెక్టర్లుగా మారే ఛాన్స్ ఉంది.
Also Read : Sandeep Reddy Vanga: అసలు ప్యాంట్ లో ఐస్ గడ్డలు వేసే సీన్ ఎందుకు పెట్టా అంటే.!