Gold Rate: నిగనిగలాడుతున్న బంగారం ధర.. ఇంకొద్ది రోజుల్లో అక్షయ తృతీయ రాబోతుంది. ఇంతలా పెరిగిన బంగారంను ప్రజలు ఎలా కొంటారు. సామాన్య ప్రజలు వన్ గ్రామ్ గోల్డుతో సరిపెట్టకోవాలా? అసలు బంగారం ఎందుకు ఇంత పెరుగుతుంది? సరిగ్గా గతేడాది తులం బంగారం ధర రూ.75 వేలు, ఇప్పుడు లక్ష.. అంటే ఏడాదిలోనే రూ.25 వేలు పెరిగింది. పసిడి రికార్డు బద్దలకోడుతు పరుగులు పెడుతుంది. బంగారం రోజు రోజుకు ఇలా పెరుగుతూ పోతే పసిడి ప్రియుల పరిస్ధితి ఏంటి.. సామాన్య ప్రజులు అసలు బంగారం కొనగలరా..
వామ్మో.. బంగారం
చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో పెరిగిన బంగారం ధర. మంగళవారం నాడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,350 కి పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,900 కు పెరిగింది. సోమవారం రోజు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 98, 350 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 90,150 ఉంది. ఈ సంవత్సరం పూర్తి అయ్యే సరికి లక్ష ఇరవై ఐదువేలు అవుతుందని అంటున్నారు. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న సుంకాల ద్వారా బంగారం ధర ఇంతాల పెరుగుతుందని చెబుతున్నారు.
మెున్నటి వరకు బంగారం తగ్గుతది అనుకున్నవారు ఇప్పుడు లక్షకు దాటిందని ప్రజలు బయందోళనకు గురవతున్నారు. నిన్న అంటే సోమవారం లక్షకు దగ్గరలో ఉన్న బంగారం ధర.. నేడు అంటే మంగళవారం రూ.3000 పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రజలు బంగారం కొనాలంటే వారికి ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా! ట్రంప్ వల్ల బంగారం ఇంకా ఎంత రేగు పెరుగుతుందో అని నిపుణుల సైతం అంచనా వేయలేని పరిస్థితి.
Also read: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ఇంతలా పెరిగిన బంగారంపై ప్రజలు కొనడానికి మెగ్గు చూపుతారా? ఇలాగే బంగారం పెరుగుతూ పోతే పసిడి ప్రియులు కూడా కొనడం మానేస్తారమో.. రేపటి రోజుల్లో పెళ్లిల్లు అవుతే ప్రజలు బంగారం కొంటారా.. లేదంటే వన్ గ్రామ్ గోల్డ్‌తో సరిపెట్టుకుంటారా.. ఇంకా బంగారం ఇలాగే పెరుగుతుందా? లేదా సోషల్ మీడియాలో చెప్పినట్లుగా బంగారం రేటు రూ.50,000కు పడిపోతుందా.. అని ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.