OTT Movies: ప్రతి వారం లాగే ఈ వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం నెల రోజుల నుంచి పుష్ప 2 మూవీ హవా కొనసాగుతుంది. ఇక ఈ నెల క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన మూవీస్ అండగా ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఈ ఇయర్ ఎండ్ అయిపొయింది. న్యూయర్ కానుకగా ఈ వారం ఒక మలయాళ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలోకి రానుంది. ఉన్ని ముకుందన్ నటించిన మార్కో తెలుగు వెర్షన్ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ ఒక్కటే మూవీ రిలీజ్ కాబోతుంది. ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.
అయితే ఈ వారం తెలుగులో పెద్దగా సినిమాలు లేవు.. వచ్చే వారంలో ఓటీటీలోకి అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప 2 రాబోతుంది. ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో ప్రదర్శితమైన ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా తెగ నచ్చేసింది. కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధానపాత్రల్లో నటించారు. ఇక హాలీవుడ్ మూవీస్ దర్శనం ఇస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఏవో ఓ లుక్ వేద్దాం పదండి..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
గ్లాడియేటర్ 2 – జనవరి 1
బీస్ట్ గేమ్స్ షో (నాలుగో ఎపిసోడ్) – జనవరి 2
ది రిగ్ (వెబ్ సిరీస్) – జనవరి 2
గుణ సీజన్ 2 (వెబ్ సిరీస్) – జనవరి 3
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ – జనవరి 3
నెట్‌ఫ్లిక్స్..
అవిసీ: ఐయామ్ టిమ్ (డాక్యుమెంటరీ) – డిసెంబర్ 31
డోంట్ డై: ద మ్యాన్ హు వాంట్స్ టు లివ్ ఫరెవర్ – జనవరి 1
ఫ్యామిలీ క్యాంప్ – (జనవరి 1)
రీయూనియన్ – జనవరి 1
లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) – జనవరి 1
మిస్సింగ్ యు (వెబ్ సిరీస్) – జనవరి 1
ద బ్లాక్ స్విండ్లర్ – జనవరి 1
సెల్లింగ్ ది సిటీ (వెబ్ సిరీస్) – జనవరి 3
వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సిరీస్) – జనవరి 4
ఆహా..
జాలీ ఓ జింఖానా (తమిళ చిత్రం) – డిసెంబర్ 30
లయన్స్‌గేట్ ప్లే..
డేంజరస్ వాటర్స్ – జనవరి 3
టైగర్స్ ట్రిగ్గర్ – జనవరి 3
బుక్ మై షో..
క్రిస్మస్ ఈవ్ ఇన్‌మిల్లర్స్ పాయింట్ – డిసెంబర్ 30
మనోరమా మ్యాక్స్..
ఐయామ్ కథలన్ (మలయాళం) – జనవరి 1
ఈ మూవీస్ ఓటీటీ లో సందడి చెయ్యనున్నాయి. వీటితో పాటుగా మధ్యలో కొన్ని సినిమాలు యాడ్ అవుతున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే బాలయ్య, వెంకటేష్ నటిస్తున్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఏ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..