OTT Movie : కొన్ని సైకో కిల్లర్ సినిమాలను చూస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. వీటి కన్నా హారర్ సినిమాలే నయం అనుకుంటారు. అంతలా హింసించి చంపుతూ ఉంటారు సైకో కిల్లర్స్. కొరియాలో నిజజీవితం లో జరిగిన సంఘటన ఆధారంగా ఒక మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఈ కొరియన్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…
ఆపిల్ టీవీ (Apple TV)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘ది చేజర్‘ (The Chaser). ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కిమ్ యూన్సి యోక్హా, జంగ్వూ నటించారు. ఈ మూవీకి హాంగ్-జిన్ తొలి దర్శకుడిగా దీనికి దర్శకత్వం వహించారు. నిజ జీవితంలో ఒక కొరియన్ సీరియల్ కిల్లర్ చేసిన హత్యల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సైకో థ్రిల్లర్ మూవీ ఆపిల్ టీవీ (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక హోటల్లో మేనేజర్ గా పని చేస్తుంటాడు. ఇతను అమ్మాయిలతో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక క్లైంట్ అమ్మాయిని పంపమని మేనేజర్ కి అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తా డు. మేనేజర్ ఒక అమ్మాయికి ఫోన్ చేసి అతడు చెప్పిన అడ్రస్ కి వెళ్ళమంటాడు. అయితే ఆ అమ్మాయికి ఒక కూతురు ఉంటుంది. ఇంట్లో కూతురిని ఒంటరిగా పెట్టి అతని దగ్గరికి వెళ్తుంది. ఈలోగా హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. ఇదివరకు ఆ నెంబర్ గల వ్యక్తికి ఇద్దరు అమ్మాయిలను పంపించి ఉంటాడు. వాళ్ళు ఇంతవరకు కనపడకుండా పోతారు. వాళ్లని ఈ వ్యక్తి ఏమైనా చేసి ఉంటాడని అనుకుంటాడు హీరో. అతని దగ్గరికి పంపించిన అమ్మాయికి ఈ విషయం చెప్పి, అతడు ఉండే అడ్రస్ ని సెండ్ చేయమని చెప్తాడు. ఏమాత్రం డౌట్ వచ్చినా నిన్ను చంపేస్తాడని, జాగ్రత్తగా ఉండమని చెప్తాడు హీరో. ఆ ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయికి ఆ సైకో కిల్లర్ వెల్కమ్ చెప్తాడు. స్నానానికి వెళుతున్నాను అని చెప్పి, అడ్రస్ ని సెండ్ చేయడానికి చూస్తుంది. సిగ్నల్ లేకపోవడంతో కంగారు పడుతుంది. తప్పించుకొని పోవాలని కిటికీ తెరిచి చూస్తుంది. అయితే కిటికీకి అడ్డంగా గోడ కట్టి ఉంటారు. భయపడుతూ మళ్ళీ అతని దగ్గరికి వస్తుంది. ఆమెను ఆ సైకో కిల్లర్ కాళ్లు చేతులు కట్టేసి, సుత్తితో కొడతాడు. అక్కడే ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడిపోతుంది. ఇంటి బయట కాలింగ్ బెల్ మోగడంతో సైకో కిల్లర్ బయటికి వస్తాడు. ఇద్దరు ముసలి వాళ్లు తమ కుక్క ఇక్కడికి వచ్చిందంటూ అడుగుతారు.
నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారంటూ ఆ ఇద్దరినీ కూడా చంపేస్తాడు సైకో కిల్లర్. ఆ తర్వాత వాళ్ళ కారు తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఒకచోట ఆగుతాడు. అతని అడ్రస్ వెతికే క్రమంలో, హీరో సైకో కిల్లర్ ని చూస్తాడు. అతని మీద రక్తపు మరకలు ఉండటంతో డౌట్ వచ్చి ఫోన్ చేస్తాడు హీరో. అమ్మాయిని బుక్ చేసుకునేది ఇతడే అని గ్రహించి పోలీసులకు పట్టిస్తాడు. పోలీసులు ఇతన్ని ఇంటరాగేట్ చేస్తారు. అయితే అతడు తికమకగా సమాధానాలు చెప్తూ ఉంటాడు. అమ్మాయిలను చంపానని అయితే ఆ విషయాలు నాకు ఏమీ గుర్తు లేవని చెప్తాడు. అతని ఇల్లు కూడా గుర్తు లేదు అంటూ సమాధానం చెప్తాడు. మరోవైపు పోలీసులు ఇతడు నిజంగా సైకో కిల్లరా, అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చివరికి హీరో ఆ సైకో కిల్లర్ ఇంటిని కనిపెడతాడా ?. అందులో హీరోకి దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తాయి? హీరో తెలుసుకున్న ఆ విషయాలు ఏమిటి? సైకో కిల్లర్ బుక్ చేసుకున్న అమ్మాయిలను మాత్రమే ఎందుకు చంపాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కొరియన్ మూవీని చూడాల్సిందే.