BigTV English

Unstoppable 4: రష్మిక లవర్‌పై హింట్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. స్టేజ్‌పై బాలయ్య షాక్

Unstoppable 4: రష్మిక లవర్‌పై హింట్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. స్టేజ్‌పై బాలయ్య షాక్

Unstoppable 4: ప్రతీ ఏడాది సంక్రాంతిలాగానే 2025 సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ మామూలుగా లేదు. ఆ పోటీలో బాలకృష్ణ కూడా నిలబడ్డాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’తో సంక్రాంతి బరిలోకి దిగనున్నారు బాలయ్య. ఈ మూవీని ప్రమోట్ చేయడానికి బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. తాను స్వయంగా హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 4’ షోలోకి గెస్టులుగా ‘డాకు మహారాజ్’ డైరెక్టర్ బాబీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగవంశీ వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అందులో మూవీ టీమ్ అంతా కలిసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.


రష్మిక పెళ్లి

‘అన్‌స్టాపబుల్’ షోలోకి తమన్ ఉరుములతో, మెరుపులతో ఎంటర్ అయ్యాడు. థియేటర్లలో స్పీకర్ కాలిపోయిందంటే దాని క్రెడిట్ బాలయ్యకే అన్నాడు తమన్. మరోసారి ‘డాకు మహారాజ్’తో స్పీకర్లు పేలిపోతాయని ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేశారు బాలయ్య. తమన్ గురించి తాను ఇంటర్నేషనల్ స్టోరీస్ విన్నానని, అనుష్క అంటే తనకు ఇష్టం కదా అని అన్నారు. తనకు రష్మిక అంటే క్రష్ అని, పెళ్లి సెటిల్ అయ్యిందని విన్నానని చెప్పారు. ‘‘తెలుగు హీరోను పెళ్లి చేసుకుంటుందని తెలుసు. కానీ ఎవరు అనేది మాత్రం బయటికి చెప్పడం లేదు’’ అని నిర్మాత నాగవంశీ సమాధానమిచ్చారు. వెంటనే పేరు చెప్తే వెబ్‌సైట్స్‌కు పనికొస్తాయని కౌంటర్ ఇచ్చారు బాలయ్య.


Also Read: అతడి వల్లే నా కెరియర్ ఆగిపోయింది.. సీనియర్ హీరోయిన్..!

ఫోన్ కాల్స్ సందడి

అందరూ కలిసి దర్శకుడు బాబీని ఒక ఆట ఆడేసుకున్నారు. వాళ్ల బ్యాక్ స్టోరీస్ అన్నీ చెప్పిన తర్వాత వారితో పోలిస్తే తాను మంచోడని అనిపిస్తుందని చెప్పి అందరినీ నవ్వించారు బాలయ్య. ఆ తర్వాత బాలయ్యను కలిసి ఒక ఆట ఆడుకున్నారు. చాలావరకు ఎపిసోడ్స్‌లాగానే ఇందులో కూడా ఒక హీరోకు కాల్ చేసి మాట్లాడారు. డైరెక్టర్ బాబీ నేరుగా రవితేజకు ఫోన్ చేసి బాలయ్య చేతిలో పెట్టారు. బాలయ్య.. నేను కూడా ఫోన్ చేసుకుంటానంటూ ప్రగ్యా జైస్వాల్‌కు ఫోన్ చేశారు. తమన్‌కు చాలా క్యూట్‌గా మిస్ యూ అని చెప్పగా తను సిగ్గుపడ్డాడు. ‘‘అది వినగానే సినిమాకు పనిచేశారా? ఆమెకు పనిచేశారా?’’ అని అడిగాడు నాగవంశీ. చివరిగా అందరూ కలిసి బాలయ్య పాటకు స్టెప్పులు కూడా వేశారు.

ఎన్నో స్పెషల్స్

డైరెక్టర్ బాబీ తన లవ్ స్టోరీ చెప్పడం, సినిమా సెట్‌లోని ఒక వ్యక్తిని కొట్టిన అనుభవాన్ని నాగవంశీ షేర్ చేసుకోవడం.. ‘అన్‌స్టాపబుల్ 4’ ఎపిసోడ్‌లో హైలెట్ కానున్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. దర్శకుడిగా ఉన్నది కొన్ని సినిమాల అనుభవమే అయినా అందులో చాలామంది సీనియర్ హీరోలతో కలిసి పనిచేశాడు బాబీ. అలాగే బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన పాటలు, పోస్టర్లు.. ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈసారి సంక్రాంతి హీరోగా బాలయ్య నిలవాలని తన ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×