OTT Movie : మలయాళం నుంచి వస్తున్న సినిమాలకు మన ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తున్న ఈ సినిమాలను ఆలస్యం చేయకుండా చూస్తున్నారు. నెమ్మదిగా, సరదాగా సాగిపోయే ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అలా సాగిపోయే ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సైనా ప్లే (Saina play) లో
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘పజాంజన్ ప్రణయం‘ (Pazhanjan pranayam). 2023లో విడుదలైన ఈ మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీకి బినీష్ కలరిక్కల్ దర్శకత్వం వహించాడు. పెళ్లి వయసు దాటిపోయిన వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో రోనీ డేవిడ్ రాజ్, విన్సీ అలోషియస్, అజీస్ నెడుమంగడ్ నటించారు. ఈ మూవీ సైనా ప్లే (Saina play) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మోహన్ 40 సంవత్సరాల వయసులో పెళ్లి చూపులకి సిద్ధపడుతుంటాడు. గతంలో ఒక ప్రమాదంలో తల్లి చనిపోవడంతో, తండ్రి మంచానికే పరిమితం అవుతాడు. తండ్రిని చూసుకోవడంతోనే సమయం గడిచిపోతుంది. చివరికి పెళ్లి చేసుకుందామని ప్రయత్నించినప్పుడు, మోహన్ ని అందరూ రిజెక్ట్ చేస్తుంటారు. ఇతడు ట్యూషన్లు చెప్పుకుంటూ మాత్రమే ఉండటంతో, రిజెక్ట్ చేయడానికి కూడా ఒక కారణం అవుతుంది. ఉద్యోగం కూడా సరిగ్గా లేకపోవడంతో ఇతని పెళ్లి కలలాగా మిగిలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో నిషా అనే అమ్మాయి కూడా, ఉద్యోగం సరిగ్గా లేని కారణంగానే రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మోహన్ ఫ్రెండ్, ఇతనికి మోడ్రన్ గా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారని చెప్తాడు. అందుకు తండ్రిని చూసుకోవడానికి ఒక పనిమనిషి పెట్టి, ప్రయత్నించమని చెప్తాడు. అయితే ఆ పని మనిషిని కూడా నేనే సెట్ చేస్తాను అంటూ మాయ అనే ఒక అమ్మాయిని సెట్ చేస్తాడు. ఆ తర్వాత మోహన్ నిషా వెంట పడుతూ ఉంటాడు. మోహన్ కి అమ్మాయిలు వెంటపడితే ఇష్టపడతారని అనుకుంటాడు. అయితే నిషా ఇలా వెంటపడితే పోలీసులు కంప్లైంట్ చేస్తాను అని చెప్తుంది. భయపడి ఆమె చుట్టూ తిరగడం మానేస్తాడు. ఇంట్లో మాయ వీళ్ళిద్దరికీ మంచి భోజనం చేసి, మోహన్ తండ్రిని బాగా చూసుకుంటూ ఉంటుంది.
మోహన్ తండ్రి భార్య చనిపోయాక, బాగా డిప్రెషన్ కి వెళ్లిపోయి ఉంటాడు. చాలా సంవత్సరాలుగా అతడు నవ్వడం మానేసి ఉంటాడు. ఒకసారి మాయ వీళ్ళు వింటున్న పాత పాటలను ఆపి, మోడ్రన్ పాటలకు డాన్స్ వేస్తూ ఉంటుంది. ఆ పాటలకు మోహన్ కూడా డాన్స్ వేయడానికి ట్రై చేస్తాడు. అదే సమయంలో మోహన్ కి లుంగీ ఊడిపోతుంది. ఆ సన్నివేశం చూసి తండ్రి నవ్వడం మొదలుపెడతాడు. తండ్రి నవ్వగానే మొహన్ కి ఆనంద భాష్పాలు వస్తాయి. అలా ఈ అమ్మాయిని ఇష్టపడడం మొదలు పెడతాడు మోహన్. అయితే మాయ ఇదివరకే ఆన్లైన్లో ఒక వ్యక్తి తో పరిచయం ఉంటుంది. ఆ వ్యక్తిని ఒకసారి కలవాలని వెళుతుంది. మాయ బాగా డబ్బున్న అమ్మాయి అనుకుంటాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత మాయతో తాను అబ్బాయితోనే రిలేషన్ లో ఉన్నానని చెప్తాడు. అతన్ని లైఫ్ లో వదులుకున్న తర్వాత మాయ అంతగా బాధపడదు. ఎందుకంటే మోహన్ ని మాయ ఇష్టపడుతూ ఉంటుంది. చివరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారా? పెళ్లి జరుగుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.