BigTV English

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ కు బాలీవుడ్ షాక్.. టైగర్ నాగేశ్వరరావు మెప్పించలేదా?

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ కు బాలీవుడ్ షాక్.. టైగర్ నాగేశ్వరరావు మెప్పించలేదా?
Tiger Nageswara Rao

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ ఈ దసరాకు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. తెలుగు లో మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా కూడా బాగానే రాబడుతున్న ఈ చిత్రం హిందీలో మాత్రం అంత ఆశాజనకంగా లేదు. టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక బేస్ ను ఏర్పాటు చేసుకోవాలి అనే తపనతో రవితేజ పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారేట్టుగా ఉంది. రవితేజ సినీ కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ గా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు హిందీలో బాగా నిరాశ పరుస్తుంది.


ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో దొంగలకు అడ్డాగా పేరు పొందిన స్టువర్టుపురం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. అప్పట్లో ప్రజలను గడగడలాడించిన స్టువర్టుపురం పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రను పోషించాడు. దసరాకు బరిలోకి దిగిన ఈ చిత్రం తెలుగులో బాలయ్య భగవంత్ కేసరి, విజయ్ లియో తలపడింది. ఈ మూవీ మిగిలిన రెండు చిత్రాలతో పోల్చుకుంటే కలెక్షన్స్ పరంగా కాస్త వెనుకంజలో ఉన్నబాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ నమోదు చేసింది.

తెలుగుతోపాటు హిందీ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మూవీలో ముఖ్యంగా నార్త్ ప్రజలకు నచ్చే కంటెంట్ ఉండేలా చూసుకున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న నటుడు అనుపమ ఖేర్ ను ఈ మూవీలో ఓ ప్రత్యేకమైన స్పెషల్ పాత్ర పోషించారు. ఇంతకుముందు అనుపమ ఖేర్ కార్తికేయ 2 లో నటించారు. కృష్ణుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం సౌత్ లో కంటే నార్త్ లో దంచి కొట్టే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అదే ట్రిక్ టైగర్ నాగేశ్వరరావు లో కూడా వర్క్ అవుతుంది అని ఆశించిన చిత్ర బృందానికి షాక్ తగిలింది.


హిందీలో మంచి హిట్ కొడతామని ఉద్దేశం తో నార్త్ లో ప్రమోషన్స్ పై కూడా మూవీ యూనిట్ బాగా దృష్టి పెట్టారు. అయితే అనుకున్నవన్నీ తారుమారు చేస్తూ ఊహించనటువంటి విధంగా అతి తక్కువ కలెక్షన్స్ తో టైగర్ నాగేశ్వరరావు హిందీ వెర్షన్ డీలా పడిపోయింది. తెలుగులో కేవలం రవితేజ మీద ఉన్న క్రేజ్ వల్ల ప్రేక్షకులు ఈ మూవీ ని చూడడానికి థియేటర్ల వరకు వస్తున్నారు. మిగిలిన భాషల్లో అంతగా థియేటర్ల కు వచ్చి మరి ఈ మూవీ చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. రవితేజ హిందీలో ఈ మూవీ హిట్ అయితే తనకు బాలీవుడ్ లో కూడా గ్రిప్ దొరుకుతుంది అన్న ఆశతో ప్రమోషన్స్ లో ఎంతో చురుకుగా పాల్గొన్నాడు. ప్రస్తుతం తెలుగులో మరొక 36 కోట్లుఈ చిత్రం కలెక్ట్ చేయగలిగితే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకున్నట్టే.. మరి ఈ వీకెండ్ లోపు మూవీ ఆ టార్గెట్ ని క్రాస్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×