Thaman: కెరీర్ స్టార్టింగ్‌లో ఏమోగాని… ఈ మధ్య కాస్త మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు థమన్. నిజానికి అవన్నీ కాపీ సాంగ్స్, కాపీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటూ వినిపిస్తూనే ఉంటాయి. థమన్ మ్యూజిక్‌కు ఒరిజనల్ సోర్స్ బయటపెడుతూ ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు కూడా. కాని, థమన్ మాత్రం డోంట్ కేర్ అనుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. ఎక్కడ కాపీ కొట్టామని కాదు.. సాంగ్ హిట్ అయిందా లేదా అన్నదే థమన్‌కు ఇంపార్టెంట్. ఒకప్పుడు డిజిటల్ టోన్‌తో సాంగ్స్ వినిపించి విసిగెత్తించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్… ఇప్పుడు కాస్త వినసొంపైన పాటలు, మంచి బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. అందుకే, టాప్ డైరెక్టర్లు సైతం థమన్ చుట్టూ తిరుగుతున్నారు. బట్.. ఇదే అసలు సమస్య తెచ్చిపెడుతోంది.
స్టార్ డమ్ వచ్చిన తరువాత థమన్ క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. పైగా ఒక్కో సినిమాకు ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. ఎవరైనా ఈ పొజిషన్‌లో ఉంటే 24 గంటలూ కష్టపడతారు. ఒకప్పుడు మణిశర్మ అయితే ఒకేసారి ఐదారు పెద్ద హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించాడు. చాలా పెద్ద ప్రాజెక్టులను క్యాప్చర్ చేసుకున్నాడు. అలా ఉండాల్సిన థమన్ ఇప్పుడు ప్రాజెక్టులను నెగ్లెక్ట్ చేస్తున్నాడని టాక్. సినిమా ఇండస్ట్రీలో కొందరు టాప్ డైరెక్టర్లు, టాప్ ప్రొడ్యూసర్లు థమన్ గురించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నారనే వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్నందున ఇక మీదట పెద్ద సినిమాలు అప్పగించకూడదని, థమన్‌పై వర్క్ లోడ్ తగ్గించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇకపై పెద్ద సినిమాలు థమన్‌కు రానట్టే. ఎంతసేపు చిన్న సినిమాలే చేసుకుంటూ పోతే.. కొంతకాలం తరువాత థమన్ అనే మ్యూజిక్ డైరెక్టరే కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది.
ఇక థమన్ యాటిట్యూడ్ గురించి కూడా మాట్లాడుకుంటోంది టాలీవుడ్. ఓవైపు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయాల్సింది పోయి… వెళ్లి క్రికెట్ ఆడుకోవడం, ఆహా ఓటీటీలో ప్రోగ్రామ్ కోసం షాపింగ్, డ్రెస్సింగ్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నాడంటూ చెప్పుకుంటున్నారు. థమన్ నుంచి మ్యూజిక్ తీసుకోవడం కోసం.. ఓ డైరెక్టర్ ఈమధ్య పబ్‌లకు గట్రా తీసుకెళ్లి, బుజ్జగించాడట. అలా ఫ్రెండ్‌షిప్ పెరిగితేనైనా మ్యూజిక్ ఇస్తాడేమో అనే ఆశతో. కాని, అలా కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లేదని టాక్.