OTT Movie : దేవుడి పేరు చెప్పుకొని ఆ ముసుగులో ఎన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డు, అదుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినా ప్రజలు గుడ్డిగా నమ్ముతూ, విలువైన జీవితాలను కోల్పోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో తాను దైవదూత అని, ఒక వ్యక్తి అమ్మాయిలను మోసం చేస్తుంటాడు. చివరికి కన్న కూతుర్లని కూడా భార్యగా ఉండమంటాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ది అదర్ ల్యాంబ్’ (The other lamp). 2019లో విడుదలైన ఈ మూవీకి మాగోర్జాటా స్జుమోవ్స్కా దర్శకత్వం వహించారు. దీనిని C.S. మెక్‌ముల్లెన్ రచించగా, ఇందులో రాఫీ కాసిడీ, మిచెల్ హుయిస్మాన్, డెనిస్ గోఫ్ నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక అడవి ప్రాంతంలో షెఫర్డ్ అనే వ్యక్తి కొంతమంది అమ్మాయిలతో కలిసి జీవిస్తూ ఉంటాడు. వాళ్లంతా ఒంటరి జీవితంతో విసిగిపోయిన వాళ్ళు కావడంతో, వాళ్లను తన మాయలో పడేసి బానిసల్లాగా చూస్తూ ఉంటాడు షెఫర్డ్. తనకు తానుగా దేవుడిగా చెప్పుకొని, ఒక అడవి ప్రాంతంలో నచ్చిన వాళ్ళతో ఏకాంతంగా గడుపుతుంటాడు. అక్కడే ఇతని వల్ల కలిగిన సంతానం చాలా మంది ఉంటారు. అబ్బాయిలు పుడితే చంపేస్తూ,అమ్మాయిలు పుడితే పెంచుకుంటూ ఉంటాడు. ఇతడు కూతుర్లను కూడా వదలకుండా ఏకాంతంగా గడుపుతాడు. ఇతని కూతుర్లలో స్టెల్లా కాస్త తెలివైనది. ఎందుకనో ఆమెకు ఇతని మీద అంతగా నమ్మకం ఉండదు. షెఫర్డ్ కి స్టెల్లాపై కూడా కన్ను పడుతుంది. ఆ ప్రాంతంలోనే ఒక గదిలో సారా అనే అమ్మాయిని బంధిస్తాడు షెఫర్డ్. ఆమె షెఫర్డ్ చెప్పినట్లు నడుచుకోలేదని అలా చేస్తాడు. ఒకసారి స్టెల్లా ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. మీ వరకు వస్తేనే విషయం తెలుస్తుంది అని సారా చెప్తుంది.
షెఫర్డ్ అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు, తన మాటలతో మయా చేస్తుంటాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ ప్రాంతానికి పోలీసులు వచ్చి, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని చెప్తారు. అప్పుడు షెఫర్డ్ వాళ్ళను తీసుకొని వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటాడు. ఒకచోట ఆగి భార్యలను చెరువులో ముంచుతూ చంపేస్తుంటాడు. వీళ్లకు స్వర్గాన్ని ప్రసాదిస్తున్నానని కూతుర్లతో చెప్తాడు. కూతుర్ల దగ్గరికి వచ్చి మీరందరూ నాకు భార్యలుగా ఉండాలని ఆదేశిస్తాడు. చివరికి షెఫర్డ్ ఆగడాలు ఎవరు ఆపుతారు? కూతుళ్లు అతని ఆదేశాలు పాటిస్తారా? స్టెల్లా వీరికి ఒక దారి చూపుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది అదర్ ల్యాంబ్’ (The other lamp) అనే ఈ మూవీని చూడాల్సిందే.