Betting apps case : ఈజీగా డబ్బులు సంపాదించాలని చాలామంది బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అన్ని యాప్లు నిజమైనవా అంటే కాదని చెప్పాలి.. కొన్ని యాప్స్ మోసపూరితం ఉన్నాయి. ఇలాంటి యాప్ లను నమ్మి కొంతమంది ఏకంగా ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలు ఎక్కువ అవ్వడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.. బెట్టింగ్ యాప్ లపై కన్నెర్ర చేస్తున్నారు. ఈ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సెలెబ్రేటిలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తూ కేసులను నమోదు చేశారు. ఇప్పటికే ఎంతో మందికి నోటీసులు పంపి పోలీస్ స్టేషన్ కు రావాలని కోరారు. కొందరు స్టేషన్ కు వెళ్తే.. మరికొందరు మాత్రం కోర్టును ఆశ్రయిస్తున్నారు. తాజాగా యాంకర్ శ్యామల ఈ కేసు పై హైకోర్టులో ఫిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. నేడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఆమె విచారణకు హాజరు కానుందని సమాచారం..
బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై పోలీసులు సీరియస్..
ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. టీవీ, సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియా, రీతూ చౌదరి హాజరయ్యారు. నేడు యాంకర్ శ్యామల స్టేషన్లో అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరి ఈ నెల 25న మళ్లీ ఎంక్వైరీకి రానున్నారు. యాంకర్ శ్యామల తనపై ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు, విచారణకు సహకరించాలని శ్యామలను కోర్టు ఆదేశించింది.
Also Read : రష్మికకు, ఆమె తండ్రికి ఆ ప్రాబ్లెం లేదు.. మీకెందుకు? సల్లూ భాయ్ సీరియస్..
పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల..
యాంకర్ శ్యామల పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఏపీలోని ప్రముఖ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆమె అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కూటమిపై అలాగే పవన్ కళ్యాణ్ పై సంచల వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా బెట్టింగ్ యాప్ కేసులో ఈమె పేరు ఉన్నట్లు తెలుస్తుంది పోలీసులు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. సోమవారం విచారణకు హాజరయ్యారు. విచారణకు వచ్చిన యాంకర్ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల మధ్యలో యాంకర్ పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు. సుమారు గంటన్నర పాటుగా ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణ అనంతరం పోలీసులు పూర్తి వివరాలను కోర్టుకు అందించనున్నారు. ఈ విచారణ గురించి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. ఇక వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం.
వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది. అటు మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విజయ్‌దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభా శెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి సహా పంజాగుట్ట పీఎస్‌లో విచారణ ఎదుర్కొంటున్న 11 మందిపైనా కేసు నమోదు కాగా, ఈ విచారణ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ కేసును పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు.. ఇలా ఇలాంటి యాప్స్ ని నమ్మి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు తెలంగాణ రాష్ట్రంలో వందల కోట్ల వరకు మోసపోయారని పోలీసులు గుర్తించారు.
పంజాగుట్ట పీఎస్‌కు శ్యామల
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు శ్యామల pic.twitter.com/7RsZnQ5Mij
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025