BigTV English

Salman Khan: రష్మికకు, ఆమె తండ్రికి ఆ ప్రాబ్లెం లేదు.. మీకెందుకు? సల్లూ భాయ్ సీరియస్..

Salman Khan: రష్మికకు, ఆమె తండ్రికి ఆ ప్రాబ్లెం లేదు.. మీకెందుకు? సల్లూ భాయ్ సీరియస్..

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మూవీ సికిందర్.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు మంచి రెస్పాన్స్ ఎందుకు ఉన్నాయి. సికిందర్ మూవీ ఈద్ కానుకగా మార్చి 30న రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఈ సందర్బంగా తాజాగా నిన్న సాయంత్రం ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


సీరియస్ అయిన సల్మాన్ ఖాన్..

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సికిందర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడారు.. రష్మిక మందన్నతో ఏజ్ గ్యాప్‌పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సల్మాన్ ఖాన్ కంటే రష్మిక మందన్న 31 ఏళ్లు చిన్నది అంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా ట్రోల్స్ వస్తోన్న విషయం తెలిసిందే.. ఈ వార్తల పై స్పందించారు సల్మాన్.. ఆయన మాట్లాడుతూ.. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఆమె తండ్రికి కూడా సమస్య లేదు. వాళ్లకే లేని సమస్య మీకు ఎందుకు? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. రష్మికకు పెళ్లైనా కూడా ఆమెతో కలిసి నటిసా..అంతే కాదు రష్మికకు ఓ కూతురు పుడితే తనతో కూడా సినిమాలు చేస్తా అంటూ సల్మాన్ ఖాన్‌ కౌంటర్ ఇచ్చాడు. ఈ దెబ్బతో ట్రోలర్స్ కు మైండ్ బ్లాక్ అయ్యినట్లు అయ్యింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..


Also Read : సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై.. అడ్వాన్స్ వెనక్కి ఇస్తాడా..?

ట్రైలర్ హైలెట్స్..

రష్మిక మందన్న, సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో సల్మాన్‌ను ప్రేమించే అమ్మాయిగా రష్మిక కనిపించింది. వారిద్దరి కెమిస్ట్రీని డిఫరెంట్‌గా ఈ ట్రైలర్‌లో చూపించాడు మురుగదాస్‌. సికందర్ మూవీలో బాహుబలి ఫేమ్‌, కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. టాలీవుడ్ లో భారీగా సక్సెస్ అయిన రష్మిక మందన్న బాలీవుడ్ లో అడుగుపెట్టింది. రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించింది ఆ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి ఛావా సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మూడో సినిమా గా సికిందర్ లో నటిస్తుంది.. ఈ మూవీపై కూడా రష్మిక ఆశలు పెట్టుకుంది ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×