BigTV English

Sri Rama Pattabhishekam: భద్రాచలంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..!

Sri Rama Pattabhishekam: భద్రాచలంలో వైభవంగా  శ్రీరామ పట్టాభిషేకం..!

శ్రీరాముడు అరణ్యవాసం నుంచి తిరిగిరాగానే, కైకేయి పుత్రుడైన భరతుడు, రాముడిని సమీపించి తండ్రిమాట నిలబెట్టడంకోసం తృణప్రాయంగా రాజ్యాన్ని విడిచి, నాకు అప్పగించి ఎలా వెళ్లావో.. అలా ఆ రాజ్యాన్ని మళ్లీ నీ పాదాల చెంత పెట్టేస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు శ్రీరాముడు సంతోషించి, తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తాడు.


శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం పూర్తయి అయోధ్యా నగరానికి వచ్చిన తర్వాత తండ్రి దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. చైత్రశుద్ధ దశమి, పుష్యమి నక్షత్రంలో శ్రీరామునికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిపించాడు.

Also Read: తెలంగాణలో మరో సమరం, బరిలో ముగ్గురు మొనగాళ్లు

దశరథుని మూడవ భార్య కైకేయిని వివాహం చేసుకునేముందు ఆమెకు పుట్టే సంతానానికి పట్టాభిషేకం చేయాలని ఆమె తండ్రి కైకేయరాజు కోరగా దశరథుడు అంగీకరిస్తాడు. కానీ చివరికి పెద్ద భార్య కౌసల్య పుత్రుడైన శ్రీరామునికే పట్టాభిషేకం జరిపిస్తాడు.

శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో భద్రాచలం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాములవారు భక్తకోటికి నేనున్నానంటూ అభయమిచ్చాడు. కల్యాణమూర్తులు శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే.. జైశ్రీరామ్‌ నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను వైదిక పెద్దలు భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా దర్శనమిచ్చారు.

మహా పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ సీతారాముల సేవలో తరించడం తన అదృష్టమన్న గవర్నర్‌.. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడం, సుఖసంతోషాలతో ఉండేలా చూడటమే రామరాజ్య స్థాపన ఉద్దేశమని చెప్పారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×