BigTV English

Venkatesh: ఇద్దరు హీరోయిన్లతో వెంకీ మామ కొత్త సినిమా.. ఆ డైరెక్టర్‌తో మూడోసారి హిట్టుకి ప్రయత్నం

Venkatesh: ఇద్దరు హీరోయిన్లతో వెంకీ మామ కొత్త సినిమా.. ఆ డైరెక్టర్‌తో మూడోసారి హిట్టుకి ప్రయత్నం


Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి మంచి హిట్టు పడి చాలా కాలమే అయింది. ఇప్పుడు అతడు బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘సైంధవ్’ మూవీ తీశాడు.

సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడంలో వెంకీ మామ విఫలం అయ్యాడు. ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. పోస్టర్స్, టీజర్‌తో హైప్ క్రియేట్ చేసిన మూవీ యూనిట్ ట్రైలర్‌తో మరింత బజ్ ఏర్పరచుకున్నారు.


దీంతో ఈ మూవీ పై ఎన్నో ఆసలు పెట్టుకున్న ప్రేక్షకులు, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతికి రిలీజై ఆడియన్స్‌ను అలరించడంలో విఫలం అయ్యారు. అయితే ఆ సమయంలోనే ఈ సినిమాకి పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్, నాగార్జున నా సామిరంగ సినిమాలు ఉన్నాయి.

READ MORE: యూట్యూబర్ షణ్ముఖ్‌కు పోలీసులు నోటీసులు.. పదిరోజుల్లో డ్రగ్ టెస్ట్‌ నివేదిక

దీంతో ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. థియేటర్లలో పెద్దగా తన హవా చూపించలేకపోయింది. ఇక ఈ మూవీ అనంతరం విక్టరీ వెంకటేష్ ఎలాంటి సినిమా ఎంచుకుంటారు. ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చింది.

వెంకటేష్ తన తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. అందువల్లనే తనకు రెండు సినిమాలతో హిట్లు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు మంచి హిట్లు అందుకొని థియేటర్లలో నవ్వులు పూయించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మూడవ చిత్రం ఇప్పుడు తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీలో వెంకటేష్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

READ MORE: ప్రభాస్ ‘కల్కి’ వాయిదా.. మేకర్స్ ఫుల్ క్లారిటీ..

అందులో ఒకరు సీనియర్ కథానాయిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ల వేటలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ సమ్మర్‌లో పట్టాలెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×