BigTV English
Advertisement

Gaami: ‘గామి’కి భారీ ఓపెనింగ్స్.. ఫస్ట్‌ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Gaami: ‘గామి’కి భారీ ఓపెనింగ్స్.. ఫస్ట్‌ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..?


Gaami: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్ కగిత దర్శకత్వంలో తెరకెక్కింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై కార్తీక్ సబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో చాందిని చౌదరి, దయానంద్ రెడ్డితో సహా మరికొంత మంది నటీ నటులు కీలక పాత్రలు పోషించారు.

మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లలో పరుగులు తీస్తున్నారు.


కాగా ఈ మూవీ కేవలం రూ.24 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రిలీజ్ అనంతరం ఈ మూవీకి వస్తున్న టాక్‌ను బట్టి నిర్మాతలకు లాభాల పంట పండించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికొస్తే..

READ MORE: విశ్వక్ సేన్ ‘గామి’ ఫుల్ రివ్యూ.. హిట్టా ఫట్టా

ఈ మూవీ మార్నింగ్ షోకు 50 శాతం, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 250కే డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.1.7 కోట్లు కలెక్ట్ చేసిందన్న మాట.

ఇక ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక గామి మొత్తంగా వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు దాదాపు రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని హీరో విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీకెండ్‌లో ఈ మూవీ ఈజీగా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే గామి మూవీకి వరల్డ్ వైడ్‌గా భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నైజాం హక్కులు రూ.3.5 కోట్లు, సీడెడ్ రూ.1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ హక్కులు రూ.3.5 కోట్ల మేర జరిగిందని సమాచారం అందుతోంది.

READ MORE: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ‘హనుమాన్’.. కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఏ ఛానల్‌లో తెలుసా

ఒక ఓవర్సీ​తో కలుపుకుని మొత్తం గామి సినిమాకు గానూ రూ.11 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇక మొదటి రోజు నుంచే సూపర్ టాక్‌ను అందుకున్న గామి ఈ వీకెండ్‌లో హిట్ స్టేటస్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×