BigTV English

Virat Kohli Deep Fake Video: వార్నీ.. ఏఐ ఎంత పనిచేసింది.. గిల్-కోహ్లీ మధ్య ఫిట్టింగ్ పెట్టేసింది!

Virat Kohli Deep Fake Video: వార్నీ.. ఏఐ ఎంత పనిచేసింది.. గిల్-కోహ్లీ మధ్య ఫిట్టింగ్ పెట్టేసింది!

Virat Kohli deepfake video criticizing Shubman Gill goes viral: టెక్నాలజీ వల్ల ఎంత విజ్ణానమో.. అంతే వినాశనం అని మరోసారి రుజువైంది. దానిని మంచి కోసం వాడవచ్చు, చెడు కోసం కూడా వాడవచ్చు. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టుగా టెక్నాలజీకి రెండు వైపులా పదునుగా మారిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి..  కొహ్లీ ఇంటర్వ్యూని డీప్ ఫేక్ వీడియో చేసి వైరల్ చేశారు.


అందులో శుభ్ మన్ గిల్ ని ఉద్దేశించి.. కొహ్లీ ఏదేదో అన్నట్టు క్రియేట్ చేశారు. ఇంతకీ వీడియో సారాంశం ఏమిటంటే.. శుభ్ మన్ గిల్ గొప్ప క్రికెటర్.. అందులో సందేహం లేదు.. నేను తనని చాలా దగ్గరగా చూశాను. తన టెక్నిక్ చాలా బాగుంటుంది.

కానీ విరాట్ కొహ్లీకి వారసుడిగా గిల్ ని చెబుతున్నారు. అది మాత్రం కరెక్టు కాదు. విరాట్ ఎప్పటికి ఒక్కడే, అతనెప్పటికి విరాట్ కాలేడు. క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ కూడా ఒక్కడే.. సచిన్ లా కొహ్లీ కాలేడు. తను వేరు, నేను వేరు, కానీ మేం ఇద్దరం మాత్రం క్రికెట్ లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం. అలాగే గిల్ ప్రయత్నించాలి.


ఈ దశకు రావడానికి నేను దశాబ్దంపాటు కఠోరంగా శ్రమించి, ఎంతో కఠినమైన బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేశాను. ఇవన్నీ చేయాలంటే గిల్ కి అనుకున్నంత ఈజీ కాదని అన్నాడు. అయితే ఈ డీప్ ఫేక్ వీడియో చూసిన విరాట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇంకా విరాట్ ఈ విషయంపై స్పందించలేదు.

Also Read: ఐసీసీ ఛైర్మన్..పేరు గొప్ప.. ఊరు దిబ్బ ?

మొత్తానికి స్టార్ క్రికెటర్ కొహ్లీ కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డాడు. ఇంతకుముందు హీరోయిన్ రష్మికా మందాన, సచిన్ టెండుల్కర్ తదితరులు ఎందరో డీప్ ఫేక్ వీడియో బాధితులే. అయితే గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో కొహ్లీ చెప్పిన మాటలను అక్కడక్కడ కట్ చేసి ఎంతో జాగ్రత్తగా ఏఐ సహాయంతో ఎడిట్ చేసి వాడారు.

అంతేకాదు అది కొహ్లీ వాయిస్ తో రావడంతో నెటిజన్లు వెంటనే గుర్తించలేకపోయారు. మొత్తానికి శుభ్ మన్ గిల్ ని అవమానించినట్టు వీడియో రావడం, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట సెగ మొదలైంది.

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×