BigTV English

Hema Committee: అసలు ఈ హేమ కమిటీ అంటే ఏంటి.. ఇండస్ట్రీలో ఉన్న కీచకులు ఎవరు?

Hema Committee: అసలు ఈ హేమ కమిటీ అంటే ఏంటి.. ఇండస్ట్రీలో ఉన్న కీచకులు ఎవరు?

Hema Committee: సినిమా.. ఒక గ్లామర్  ప్రపంచం. ఇక్కడ మంచి ఎంత ఉంటుందో.. చెడు కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేని చోటు అంటే  ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నటీమణులు.. క్యాస్టింగ్ కౌచ్ తో బాధపడుతూనే ఉన్నారు. అవకాశం కావాలంటే.. డైరెక్టర్ తో, హీరోతో, నిర్మాతతో పడుకోవాలని ఆంక్షలు. సెట్ కు వెళ్ళాక.. ఎవరు ఎక్కడ చేయి వేస్తారో అనే భయం. చివరికి కాల్, మెసేజ్ చేయాలన్నా కూడా భయమే. ఇన్ని ఇబ్బందులు దాటుకొని ఇండస్ట్రీలో నిలబడడం అనేది ఎంతో  కష్టంతో కూడుకున్న పని.


ఒకప్పుడు తమను లైంగికంగా వేధించారని  పబ్లిక్ గా చెప్పడానికి నటీమణులు భయపడేవారు. ఎక్కడ చెప్తే తమను ఏదైనా చేస్తారేమో.. అవకాశాలు రానివ్వకుండా చేస్తారేమో అని, కెరీర్ నాశనం చేస్తారేమో అని నోరు విప్పేవారు కాదు. ఇక కొద్దికొద్దిగా ఇండస్ట్రీలో ఆ భయం పోయింది. ఈ జనరేషన్ నటీమణులు.. అంతకుముందులా నోరు మూసుకొని కూర్చోవడం లేదు. నచ్చని విషయాన్నీ పబ్లిక్ గా సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. మీడియా ముందు వారి పేరు చెప్పి ఆ స్టార్స్ పరువును బజారుకీడుస్తున్నారు.  ఇప్పటివరకు ఈ క్యాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీలలో ఉంది.

హేమ కమిటీ ఎలా మొదలైంది..?


తాజాగా మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ వలన మరోసారి ఈ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు బయటపడుతున్నాయి. 2017లో నటి భావనపై జరిగిన కారు దాడి తరువాత అప్పటి ప్రభుత్వం.. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు వేధింపులకు సంబంధించిన రిపోర్టు ఇవ్వాలని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కె. హేమ, నటి శారద, మాజీ ఐఏఎస్‌ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా జస్టిస్‌ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. 2019 లో ఈ కమిటీ రంగంలోకి దిగింది.

హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి.. ? 

ఇండస్ట్రీలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారు ? ఎలాంటి కీచకులు ఇండస్ట్రీలో ఉన్నారు.. ? అనేదాని మీద పూర్తిగా ఒక నివేదికను తయారు చేసి జస్టిస్ హేమ కమిటీ.. కేరళ ప్రభుత్వానికి అప్పగించింది. ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలను చూసి  నివ్వెరపోతున్నారు. ఇప్పటివరకు ఎంతమంది కీచకులు.. మహిళా నటులను  ఎలా వేధించారో చెప్తుంటే రక్తం మరిగిపోతుంది. డైరెక్టర్, నిర్మాత, హీరో, నటుడు .. చివరికి అసిస్టెంట్స్ సైతం మహిళలను లైంగికంగా ఎలా వేధిస్తున్నారో ఆ రిపోర్ట్ లో క్లియర్ కట్ గా ఉంది.

కేరళ ప్రభుత్వం సీరియస్:

ఇక ఈ నివేదికపై కేరళ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపీడీలు, దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనను వెల్లడించిన జస్టిస్‌ కె హేమ కమిటీ అందించిన నివేదిక ప్రకారం ఒక సిట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని  ఆదేశించింది. ఇక జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తరువాత.. మలయాళ ఇండస్ట్రీలో  వేధింపులకు గురైన నటీమణులు ఒక్కొకరుగా బయటకు వచ్చి.. తాము ఎదుర్కున్న  క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెడుతున్నారు.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఎంతోమంది  నటీమణులు తమ నోరును విప్పారు.  ఇక ఆరోపణలను ఎదుర్కుంటుంది  కూడా చిన్నాచితకా నటులు కాదు. స్టార్స్ గా కొనసాగుతున్న నటులు కావడం ఆశ్చర్యం. ఇవన్నీ చూసి మలయాళ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఖంగుతింది.  పైకి ఎంతో పద్దతిగా కనిపించే స్టార్స్  వెనుక ఇంతటి చీకటి కోణం ఉందా అని ప్రేక్షకులు నోర్లు వెళ్లబెడుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి..  వయస్సుతో సంబంధం లేకుండా.. తమ వద్దకు ఛాన్స్ ల కోసం వచ్చిన అమ్మాయిలను లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

అమ్మకు మోహన్ లాల్ రాజీనామా: 

అసలు ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే.. అమ్మ(మలయాళీ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఏం చేస్తుంది. మలయాళ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేకుండా ఉంటే.. ఎలా వారు మౌనం వహిస్తున్నారు అని మండిపడుతున్నారు. అయితే అమ్మలో కూడా కీచకులు లేకపోలేదు. మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు జనరల్‌ సెక్రటరీగా కొనసాగుతున్న సీనియర్‌ నటుడు సిద్థిఖీ సైతం తనను లైంగికంగా వేధించాడని నటి రేవతి సంపత్ ఆరోపణలు చేసింది.

ఇలా నటులు మాత్రమే కాదు.. అమ్మ లో ఉన్న కొంతమంది కూడా పదవి ఉందన్న పొగరుతో ఇలాంటి నిశ్చలకు ఒడిగడుతున్నారు. ఇక ఈ ఆరోపణలు ఎక్కువ అవ్వడంతో నటుడు సిద్థిఖీ, జనరల్‌ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. కేవలం అతను మాత్రమే కాకుండా అమ్మ సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్ సైతం తన పదవికి రాజీనామా చేశాడు. మరి ఈ హేమ కమిటీ రిపోర్ట్ ఇంకెన్ని నిజాలను బయటపెడుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×