BigTV English

Tollywood : బిగ్ ప్రాజెక్ట్ పై అసంతృప్తి… వీఎఫ్ఎక్స్ నచ్చలేదంటూ బాంబ్ పేల్చిన స్టార్ హీరో

Tollywood : బిగ్ ప్రాజెక్ట్ పై అసంతృప్తి… వీఎఫ్ఎక్స్ నచ్చలేదంటూ బాంబ్ పేల్చిన స్టార్ హీరో

Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ లో పలు బడా ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ‘హనుమాన్’తో మొదలు పెడితే ‘పుష్ప 2’ వరకు రిలీజైన పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీసు దుమ్ము దులిపాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం… ఓ భారీ బడ్జెట్ సినిమా విషయంలో హీరో అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. పైగా తన సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ నచ్చలేదంటూ ఆయన బాంబు పేల్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


స్టోరీ లైన్ తో హీరోలను ఒప్పించి, ప్రకటించినంత ఈజీగా అందరు డైరెక్టర్స్ సినిమాలను తెరపైకి తీసుకెళ్లలేరు. ముఖ్యంగా విజువల్స్ విషయంలో క్లారిటీ చాలా అవసరం. లేదంటే ఇటు నిర్మాతలకు, అటు హీరోలకు కష్టాలు తప్పవు. పైగా విజువల్స్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కావడం కూడా కష్టం అవుతుంది.

ఇటీవల కాలంలో రిలీజ్ అవుతున్న చాలా సినిమాలకు వీఎఫ్ఎక్స్ అనేది కీలకంగా మారింది. షూటింగ్ కంటే ఎక్కువగా విజువల్స్ కోసం వీఎఫ్ఎక్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కంటెంట్ తో పాటు విజువల్స్ బాగుంటే సినిమా కు వచ్చే రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి ఉదాహరణ గత ఏడాది రిలీజ్ అయిన ‘హనుమాన్’ మూవీనే చెప్పుకోవచ్చు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ముఖ్య కారణం ఏమిటంటే సినిమాలో ఉన్న విజువల్స్.


విజువల్స్ అద్భుతంగా ఉండడంతో హీరో హీరోయిన్లతో సంబంధం లేకుండా కంటెంట్ ను మాత్రం చూశారు ప్రేక్షకులు. పైగా విజువల్స్ తో ‘హనుమాన్’ నిర్మాతలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ‘కల్కి 2898 ఏడి’, ‘దేవర’, ‘పుష్ప 2’ వంటి సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. ఇక త్వరలో టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు కూడా ఎక్కువగా విఎఫ్ఎక్స్ పైనే ఆధారపడి తెరకెక్కుతున్నాయి.

అలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమా విషయంలో హీరో అసంతృప్తిగా ఉన్నారనే వార్త తాజాగా ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. హీరోకి ఆ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ నచ్చకపోవడం వల్ల మళ్లీ రీవర్క్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అసలు ఆ హీరో ఎవరు? ఏ మూవీ గురించి ఇదంతా అనే చర్చకు దారి తీసింది. దీంతో నెటిజెన్లు ప్రస్తుతం ఈ వార్త ఏ మూవీ గురించి అనే విషయాన్ని గెస్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇద్దరు బడా హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతాయని టాక్ నడిచింది. అందులో ఒకటి పోస్ట్ పోన్ కాగా, మరొక మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×