BigTV English

AP – Fake Voters : ఏపీ సర్కార్ షాకింగ్ న్యూస్.. ఇకపై వారికి పింఛను కట్..

AP – Fake Voters : ఏపీ సర్కార్ షాకింగ్ న్యూస్.. ఇకపై వారికి పింఛను కట్..

AP – Fake Pensioners : ఏపీలో వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా పెంచిన విషయం తెెలిసిందే. ఎన్నికల్లో  హామి ఇచ్చిన మేరకు.. అధికారంలోకి రాగేనే నెలకు రూ.4 వేల రూపాయల పింఛన్ అందిస్తోంది. జూన్ 2024 నాటికి, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పింఛనుదారుల సంఖ్య 65 లక్షల 30 వేల 838 లుగా గణాంకాలు తెలుపుతున్నారు. వీరందరికీ పింఛను సొమ్ముల్ని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి), డోర్ డెలివరీ ద్వారా పంపిణీ చేస్తుంది. అయితే.. ఇప్పుడు లబ్దిదారుల సంఖ్యపై ప్రభుత్వానికి అనుమానులున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ విషయాన్ని ఇంకోసారి నిర్థరించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 


మీకు అర్హత లేకున్నా.. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రూ.4 వేల పింఛను అందుతుందా.. అయితే మీకు త్వరలోనే అది కట్ కావచ్చు. అర్హత లేకున్నా, తప్పుడు మార్గాల్లో పింఛన్లు పొందుతున్నట్లు అయితే.. అలాంటి వారందరికీ ఏపీ సర్కార్ షాకింగ్ వార్త చెప్పింది. ఇకపై రాష్ట్రంలో అక్రమంగా, అనర్హలకు పింఛను ఇచ్చేది లేదని తేల్చింది. ఇందుకోసం.. ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.  

రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేసినట్లు కూటమి నేతలు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పటి రాజకీయ నేతల ఒత్తిళ్లు, తెలిసిన వారికి ఇష్టారాజ్యంగా పింఛన్లు రాయించారని, వాటన్నింటినీ తొలగించాలని కోరుతున్నారు. దాంతో.. రాష్ట్రంలోని కొన్ని సచివాలయాల్లో పింఛన్ల అర్హతలపై ప్రభుత్వం.. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని శాంపిళ్లను తీసుకుని క్షేత్రస్థాయిలో వాస్తవాలని నిర్ధరించుకుంది. అందులో.. చాలా మంది అనర్హులకు పింఛను అందుతున్నట్లు గుర్తించారు. దాంతో.. తదుపరి చర్యలకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది.


బోగస్ పింఛన్లు గుర్తించేందుకు..

పింఛనును భారీగా పెంచుతుండడం, స్థానిక నేతల ఒతిళ్లకు అధికారులు తలొగ్గడంతో.. గతంలో భారీగా అనర్హులకు పింఛన్లు అందించారు. చాలా మందికి ఆధార్ కార్డులు మార్పించి వృద్ధుల పింఛను పొందుతుండగా.. వైకల్యంతో బాధపడేవారికి అదనంగా పింఛను ఇస్తుండడంతో చాాలా మంది తప్పుడు వైకల్య సర్టిఫికేట్లు పెట్టి పింఛన్లు పొందుతున్నట్లు అనుమానాలున్నాయి. దీంతో..పెన్షన్ విషయంలో వైకల్య శాతాన్ని గుర్తించేలా ప్రత్యేక చెకింగ్ విధానం చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.

ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో వైద్య బృందాలను ఏర్పాటు చేసి వైకల్యాన్ని నిర్ధరించనున్నారు. అందులో.. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వైకల్యం ఉంటేనే పింఛను ఇవ్వనుండగా.. అన్ని సచివాలయాల్లో బోగస్ పింఛన్లు తీసేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Also Read : చిరంజీవి రీఎంట్రీ.. టీజీ వెంకటేష్ క్లారిటీ, ఎందుకు?

వయస్సు ఎక్కువగా చూపించుకుని ఆధార్ కార్డులను మార్చుకున్న వారితో పాటుగా వైకల్యం లేకున్నా తప్పుడు వైకల్యం సర్టిఫికేట్లతో వికలాంగుల పింఛను పొందుతున్న వారిపై గురి పెట్టనున్నారు. ముఖ్యంగా.. పక్షవాతంతో బాధపడేవారికి ప్రభుత్వం.. నెలకు రూ.10 వేలు పింఛనుగా అందిస్తోంది. దాంతో.. వైద్యులపై ఒత్తిడి తీసుకువచ్చి, రాజకీయ నాయకుల ప్రోద్భలంతో ఇలాంటి పనులకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  అన్ని సచివాలయాల పరిధిలో బోగస్ పింఛన్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటే.. భారీగానే బయటపడతాయి అంటున్నారు. అలా చేస్తే.. ప్రజాధనమూ వృథా కాదని అంటున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×