BigTV English

T20 World Cup 2024: టీమిండియాకు ప్రపంచ కప్.. టాలీవుడ్ సినీ స్టార్ల ట్వీట్ల వర్షం..

T20 World Cup 2024: టీమిండియాకు ప్రపంచ కప్.. టాలీవుడ్ సినీ స్టార్ల ట్వీట్ల వర్షం..

T20 World Cup 2024: 2024 టీ 20 వరల్డ్ కప్‌ విజేతగా టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన భారతీయుల కళ నెరవేరింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సఫారీలను ఓడించి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు సైతం కామెంట్ల వర్షం కురపిస్తున్నారు. మరి సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించిన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.


మెగాస్టార్ చిరంజీవి

17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్ అద్భుతమైన ఆట కనబర్చారు. అందులో ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ వావ్ అనిపించింది అని చెప్పుకొచ్చారు.


రాజమౌళి

టాలీవుడ్ దర్శకు ధీరుడు రాజమౌళి టీమిండియా విన్నింగ్ మూమెంట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఇందులో భాగంగా టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను హార్దిక్ పాండ్యా హగ్ చేసుకున్న ఫొటోను షేర్ చేశాడు.

మహేశ్ బాబు

విజయం మనదే.. హీరోస్ ఇన్ బ్లూ కొత్త ప్రపంచ ఛాంపియన్స్.. టీమిండియాకు అభినందనలు.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల ఎంతో గర్వంగా ఉంది. జైహింద్ అని ట్వీట్ చేశారు.

రామ్ చరణ్

టీమిండియాకు అనూహ్య విజయం. భారతజట్టు ఆట అమోఘం. బుమ్రా అదరగొట్టేశారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఈ విజయాన్ని గుర్తుండిపోయేలా చేసినందుకు కెప్టెన్ రోహిత్ శర్మకు వందనాలు అంటూ రాసుకొచ్చాడు.

ఎన్టీఆర్

ఇది అద్భుతమైన మ్యాచ్. ఈ విజయం పట్ల ఎంతో గర్వంగా ఉంది. కంగ్రాట్స్ టీమిండియా అంటూ తెలిపాడు.

అల్లు అర్జున్

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు అంటూ చెప్పాడు.

కల్కి 2898 ఏడీ టీం

సమయం వచ్చింది.. టీమిండియా గెలిచింది అని రాసుకొచ్చింది.

సాయి ధరమ్ తేజ్

ఎప్పటికీ మర్చిపోలేని బహుమతిని మాకు అందించినందుకు టీమిండియా జట్టుకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశాడు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×