Tollywood.. సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకరి తరువాత ఒకరు తుది శ్వాస విడుస్తూ అభిమానులను మరింత శోకసంద్రంలో ముంచేస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తుంటే.. మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడుస్తున్నారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ కన్నడ దర్శకుడు ఏటి రఘు (AT Raghu) కూడా ఒకరు. ఇటీవల ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ (Ambareesh ) తో ఎక్కువగా సినిమాలు చేసిన ఈయన దాదాపు 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
దర్శకుడు ఏ.టి.రఘు కెరియర్..
దర్శకుడు ఏ.టి.రఘు విషయానికి వస్తే.. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కన్నడ, హిందీ, మలయాళం చిత్ర పరిశ్రమలలో పనిచేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. 1980లో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రఘు కొన్ని అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఇక ఈయన కొడగులో కొడవ సమాజంలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు నిర్మాత అయిన బి. విఠలాచార్య మార్గదర్శకత్వం లోనే రఘు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వై.ఆర్ స్వామి వద్ద అసిస్టెంట్ గా చేరిన ఈయన.. 1980లో ‘న్యాయ నీతి ధర్మ’ అనే కన్నడ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఏ.టి.రఘు సినిమాలు..
మొదటి సినిమాతో మంచి పేరు దక్కించుకున్న ఈయన.. ఆ తర్వాత 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1984లో రజనీకాంత్ (Rajinkanth) హీరోగా నటించిన ‘మేరీ అదాలత్’ అనే హిందీ చిత్రాన్ని కూడా నిర్మించారు. తర్వాత అదే ఏడాది మలయాళం లో ‘కట్టురాణి’ అనే సినిమా చేసి.. 1990లో ‘అజయ్ విజయ్’ అనే కన్నడ చిత్రాన్ని కూడా రూపొందించారు.. ఇక ప్రముఖ హీరో అంబరీష్ తో ఏకంగా 23 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు.
డాక్యుమెంటరీ ఫిలిం కూడా..
ఇకపోతే కర్ణాటక ప్రభుత్వం సలహా మేరకు ఒక డాక్యుమెంటరీ సినిమాకి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా కొడవ ప్రతిభను బయట ప్రపంచానికి చాటి చెప్పేందుకు కొడవ కళాకారులకు వేదిక కల్పించేందుకు.. కన్నడ భాషలో ప్రసారమైన రామాయణం కి RN.జయ గోపాల్ తో కలిసి సమన్వయకర్తగా పనిచేశారు. ఇక 2004 -2005లో ‘పుట్టన్న కనగల్ అవార్డు’తో పాటు 2020లో ‘కన్నడ రాజ్యోత్సవ అవార్డు’ ఈయనకు లభించాయి. అంతేకాదు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.