BigTV English

Tollywood: చిరంజీవి, పవన్, రామ్ చరణ్ లతో పాన్ ఇండియా మూవీ ..సంబరాలలో మెగా ఫ్యాన్స్

Tollywood: చిరంజీవి, పవన్, రామ్ చరణ్ లతో పాన్ ఇండియా మూవీ ..సంబరాలలో మెగా ఫ్యాన్స్

Harish Shankar movie with Mega Heroes(Latest news in tollywood): మెగా ఫ్యామిలీలో హీరోలకు కొదవ లేదు. అరడజను మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. మామూలుగా తెరపై మెగా స్టార్ చిరంజీవిని చూస్తేనే అభిమానులు ఎగిరిగంతేస్తుంటారు. ఆరు పదుల వయసుతోనూ మెగా స్టార్ ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్సులు, ఫైట్లు చేయడం చూసి మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. త్వరలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ అనే పాన్ ఇండియా రూపొందుతున్న విషయం విదితమే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.దాదాపు చిరంజీవికి ఉండే క్రేజ్ పవన్ పైనా ఉంది. చిరును అభిమానించే ప్రతి ఒక్క అభిమానీ పవన్ కళ్యాణ్ ను కూడా అభిమానిస్తుంటారు. ఆ ఆదరణతోనే ప్రస్తుతం ఏపీ రాజకీయాలలోనూ చక్రం తిప్పుతున్నారు మంత్రి హోుదాలో.


గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ

ఇంతింతై అన్నట్లుగా గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ ఫ్యాన్స్ అభిమానులు కూడా చరణ్ ను అభిమానించడం ప్రారంభించారు. ప్రస్తుతం చెర్రీ నటించే మూవీస్ కు గ్లోబల్ వైజ్ గా మార్కెట్ ఉంది. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ చేసిన నాటు డ్యాన్స్ ను విశ్వవ్యాప్తంా వీక్షించారు. మరి ఈ మూడు శక్తులు కలిసి ఒకే తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కు ఇంకేమయినా ఉందా? గబ్బర్ సింగ్ మూవీతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు హరీష్ శంకర్. గద్దలకొండ గణేష్ మూవీ రిలీజ్ అయిన ఐదేళ్లకు మళ్లీ హీరో రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ మూవీతో మళ్లీ తెరపైకి వచ్చారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో అన్నీ హిట్ సినిమాలే తీసిన హరీష్ శంకర్ ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అదిరిపోయే న్యూస్ అనౌన్స్ చేశాడు. తన దగ్గర ఓ పాన్ ఇండియా స్టోరీ ఉందని..అది సరిగ్గా చిరంజీవి, పవన్, చెర్రీలకు సరిపోయే కథ అని అన్నారు పైగా తాను ఆ స్టోరీ చెప్పి వాళ్లను ఒప్పించే యత్నం చేస్తున్నానని అన్నారు హరీష్.


నిజమేనా హరీష్?

భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన కథ అని ఇందులో మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే చాలా అంశాలు ఉంటాయని హరీష్ ట్వీట్ చేశారు. అయితే ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం అసలు హరీష్ కథనే వినిపించకుండా వీళ్లతో సినిమా చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదం అంటున్నారు. ఎందరో బడా నిర్మాతలకే సాధ్యం చిరంజీవి, పవన్ ల కలయిక హరీష్ వలన అవుతుందా? హరీష్ ఓవర్ చేస్తున్నాడంటున్నారు. ముందు ఈ మెగా హీరోలను ఒప్పించి..వాళ్ల అనుమతి తీసుకుని అప్పుడు చెప్పాలి హరీష్ శంకర్ కు ఉచిత సలహా ఇస్తున్నారు కొందరు. హరీష్ శంకర్ పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తాడని..వివాదాలు కూడా ఆయనకు కొత్తేమీ కాదని అంటున్నారు కొందరు. ఏది ఏమైనా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టించవద్దని కోరుకుంటున్నారు మరికొందరు అభిమానులు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×