BigTV English

Djokovic defeat Rafael Nadal: నాదల్‌ను ఓడించిన జకోవిచ్, బంగారు పతకంపై కన్ను..

Djokovic defeat Rafael Nadal: నాదల్‌ను ఓడించిన జకోవిచ్, బంగారు పతకంపై కన్ను..

Djokovic defeat Rafael Nadal(Latest sports news today): పారిస్ ఒలింపిక్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్న స్పెయిన్ బుల్, క్లో కోర్టు కింగ్ రఫెల్ నాదల్ ఆశలు అడియాశలయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో వరుస సెట్లలో సెర్బియాకు చెందిన నవోక్ జకోవిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో టెన్నిస్‌లో నాదల్ శకం ముగిసిందనే చెప్పవచ్చు.


కెరీర్ చరమాంకం ఒలింపిక్స్‌లో పతకం నెగ్గాలన్న స్పెయిన్ ఆటగాడు రఫెల్‌నాదల్ ఆశలకు గండికొట్టాడు సెర్బియా ఆటగాడు జకోవిచ్. మట్టి కోర్టులో రారాజుగా పేరు పొందిన నాదల్, అదే కోర్టులో వరుస సెట్లలో ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఫ్రెంచ్ వేదికగా టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్- జకోవిచ్‌లు రెండో రౌండ్‌లో తలపడ్డారు. ఇరువురు ఆటగాళ్ల మధ్య రసవత్తర పోరు సాగుతుందని అభిమానులు భావించారు. కాకపోతే వరుస గాయాలతో సతమతమవుతున్నాడు నాదల్.


ALSO READ: పారిస్ ఒలింపిక్స్.. గురి తప్పిన అర్జునుడు

వరుస సెట్లలో నాదల్‌ను 6-1, 6-4 తేడాతో జకోవిచ్ ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. అంతేకాదు బంగారు పతకం కన్నేశాడు. ఇద్దరు ఆటగాళ్లకు ఇది 60వ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ తర్వాత ఇరువురు ఆటగాళ్లు ఆలింగనం చేసుకున్నారు.

రఫెల్ నాదల్‌కు బంగారు పతకం సాధించే మరో ఛాన్స్ ఉంది. పురుషుల డబుల్స్ విభాగంలో తన దేశానికి చెందిన ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు అల్కరాస్‌తో కలిసి బరిలోకి దిగాడు. ఈ జోడి ఇప్పటికే సెకండ్ రౌండ్‌లో అడుగుపెట్టింది. డబుల్స్‌లో గెలిచినా ఓడినా టెన్నిస్‌కు నాదల్ గుడ్ బై చెప్పేయడం ఖాయంగా చెబుతున్నారు.

ఈ టోర్నీ ముగిసిన తర్వాత కెరీక్‌కు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంటానని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు నాదల్. 20 ఏళ్లు తర్వాత తామిద్దరు ప్రత్యర్థులుగా తలపడతామని ఊహించలేదన్నాడు జకోవిచ్. నాదల్‌తో ఆడిన మ్యాచ్‌లో చాలా ఉపశమనం పొందినట్టు అంగీకరించాడు. ఒలింపిక్స్‌లో నాదల్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో బంగారు పతకాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×