Sreemukhi: ఈ మధ్య యాంకర్స్ కు అసలు బుర్ర పని చేస్తుందో లేదో తెలియడం లేదు. ఒక ఈవెంట్ ను చేస్తున్నారు అంటే.. అన్ని ప్రిపేర్ అయ్యి రాకుండా స్టేజి మీద పేర్లు మర్చిపోవడం, పేర్లు మార్చి చదవడం చేస్తూ ట్రోల్స్ కు గురవుతున్నారు. ఇంకొంతమంది పురాణాల గురించి, దేవుళ్ల గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ విమర్శల పాలవుతున్నారు.
దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే అక్కడ ఉన్నది ఎవరు అనేది కూడా మర్చిపోతున్నారు నెటిజన్స్. సోషల్ మీడియా వేదికగా వారిని ఏకిపారేస్తున్నారు. తాజాగా యాంకర్ శ్రీముఖి ఒక ఈవెంట్ లో నోరు జారీ అడ్డంగా ఇరుక్కుంది. రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కుంది.
Haindava: టైటిల్ గ్లింప్స్ తోనే అదరగొట్టేశాడు.. బెల్లంకొండకు ఈసారైనా హిట్ దక్కేనా.. ?
యాంకర్ శ్రీముఖి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెంట్ ఏదైనా శ్రీముఖి ఉంటే అక్కడ సందడే సందడి. గలగలా మాట్లాడుతూ అస్సలు గ్యాప్ కూడా ఇవ్వకుండా మాట్లాడేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి నిజామాబాద్ లో సంక్రాంతి ఈవెంట్ ఒకటి చేసింది. ఈ ఈవెంట్ కు వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈవెంట్ లో ఇంతమంది సెలబ్రిటీలను చూస్తే శ్రీముఖి నోరు కుదురుగా ఉంటుందా.. ? ఒక్కొక్కరికి ఎలివేషన్ ఇస్తూ పరిచయం చేయడానికి పక్కాగా స్క్రిప్ట్ రాసుకుంది. అయితే అందులో భాగంగానే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా.. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒరిజినల్ అని నవీన్ పోలిశెట్టి చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్పిత పాత్రల గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఈ డైలాగ్ ను వాడేస్తున్నారు. పాపం శ్రీముఖి కూడా అలానే ఎలివేట్ చేద్దామని బొక్కబోర్లా పడింది.
సాధారణంగా అన్నదమ్ముల బంధం గురించి మాట్లాడాలి అంటే ఎవరైనా రామలక్ష్మణుల్లా ఉన్నారని చెప్తారు. శ్రీముఖి సైతం దిల్ రాజు – శిరీష్ ను పొగడడానికి రామలక్ష్మణుల పేర్లను వాడింది. అయితే ఆమె రామలక్ష్మణులు ఫిక్షనల్ అనేసింది. ” రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనేది మనం అప్పట్లోనే విన్నాం. కానీ, సాక్ష్యాత్తు రామలక్ష్మణులు నా కళ్ళముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు.. ఇంకొకరు శిరీష్” అని చెప్పుకొచ్చింది. రామలక్ష్మణుల్లా ఉన్నారు అని అంటే సరిపోయింది. కానీ , ఈ చిన్నది ఫిక్షనల్ అనే పదం వాడేసి రాముడు కథ అంతా కల్పితం అనేసింది. దీంతో హిందువులు శ్రీముఖిపై మండిపడుతున్నారు.
Jabardasth Prasad: కన్నీళ్లతో భార్య కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న జబర్దస్త్ నటుడు..
రాముడి గురించి నీకేం తెలుసనీ మాట్లాడుతున్నావ్.. వారి గురించి తెలియకపోతే తెలుసుకో అంతేకాని అవి కల్పితాలు అని నువ్వెలా చెప్తావ్ అని కొందరు, రామలక్ష్మణులు ఫిక్షనలా.. ఛీఛీ.. నీకు సిగ్గుందా.. హిందూ కుటుంబంలోనే పుట్టావా.. ? అని ఇంకొందరు.. నీ ముత్తాత ఎవరో నీకు తెలియదు అలా అని వారు ఫిక్షనల్ అవుతారా.. ? వారు లేకపోతే మరి నువ్వెలా పుట్టావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. హిందువుల అందరికీ శ్రీముఖి కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై శ్రీముఖి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Srimukhi said SRI RAMA is a “FICTIONAL CHARACTER” in a Movie Function comparing with DIL RAJU & SIRISH.
What kind of idiots TFI is Producing these days? pic.twitter.com/bmCIyrQ8wO— Sanatana Traveller (@Sanatanatravelr) January 8, 2025