BigTV English

Mahes Babu : వామ్మో.. మహేష్ బాబు ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాడా..?

Mahes Babu : వామ్మో.. మహేష్ బాబు ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాడా..?

Mahes Babu : తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక స్థానం. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. చైల్డ్ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. హీరోగా చేసిన మొదటి సినిమా నే అతనికి మంచి గుర్తింపుని ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ సూపర్ స్టార్ రేంజుకు ఎదిగాడు. ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీ లేని హీరోలలో మహేష్ బాబు ఒకరు. అందరితో కలివిడిగా ఉండటం తన పని ఏదో పని చేసుకోవడం మహేష్ బాబు చేస్తారు. ఇక మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు పలు రకాల వ్యాపారాలను చేస్తున్నాడన్న విషయం అందరికి తెలిసిందే.. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


సినీ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులలో మహేష్ బాబు ఒకరు.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనంతరం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మహేష్ బాబు ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగాలలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు.. మహేష్ బాబు వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు మరో వైపు మల్టీప్లెక్స్ థియేటర్లను కూడా నడుపుతున్నారు. అలాగే తన భార్య నమ్రతతో కలిసి వ్యాపారంలోకి అడుగు పెట్టి వ్యాపారాల్లో ఎదురులేని మనిషిగా లాభాలను పొందుతూ కోట్లు సంపాదిస్తున్నాడు..

మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు ఆన్లైన్ విద్యా బోధన కోసం సరికొత్త యాప్ ను తీసుకు వచ్చే ప్రయత్నం లో ఉన్నారు. దీని కోసమే ఇప్పటికీ ఈ విషయం గురించి మల్టీ నేషనల్ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం. ఇక ఈ యాప్ డౌన్లోడ్ చేయడం కోసం మహేష్ బాబు ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ఓ వార్త అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. కాకపొతే ఈ వార్తలు ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా మహేష్ బాబు విద్యాబోధన కోసం ఇటువంటి యాప్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.. ఇదే కనుక నిజమైతే స్టూడెంట్స్ పాలిట మహేష్ దేవుడు అవ్వడం పక్కా..


ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఇటీవల ఏ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు 2027 లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు..

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×