BigTV English

Railways – Prayagraj: ప్రయాగరాజ్ లో రైల్వే సరికొత్త రికార్డు, ఒకే రోజు ఎన్ని రైళ్లు నడిపిందంటే?

Railways – Prayagraj: ప్రయాగరాజ్ లో రైల్వే సరికొత్త రికార్డు, ఒకే రోజు ఎన్ని రైళ్లు నడిపిందంటే?

Maha kumbh Mela 2025: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా ఆధ్యాత్మిక వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక పవిత్ర మౌని అమావాస్య నాడు కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు తరలి వచ్చారు. ఒకే రోజు సుమారు 6 కోట్లకు పైగా భక్తులు తరలి వచ్చినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మౌని అమావాస్య రోజున సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి ఇంటికి తిరిగి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రయాగ్‌రాజ్‌ లోని వివిధ స్టేషన్ల నుంచి రికార్డు స్థాయిలో రైళ్లను నడిపినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఒకే రోజులో 364 రైళ్లు భక్తులను తీసుకెళ్లాయని తెలిపింది. ప్రయాగరాజ్ మహా కుంభమేళా సమయంలో ఒకే రోజులో ఇన్ని రైళ్లను నడపడం ఇదే తొలిసారని వెల్లడించింది.


వార్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

మౌని అమావాస్య రోజున ప్రయాగరాజ్ రైళ్ల రాకపోకల గురించి రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ఒకే రోజు ప్రయాగరాజ్ నుంచి 364 రైళ్లను నడిపినట్లు తెలిపారు. రైల్వేలోని సీనియర్ అధికారుల బృందం రైల్ భవన్‌ లోని వార్ రూమ్ నుంచి మొత్తం పరిస్థితిని పర్యవేక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయంతో రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు.  రైల్వే బోర్డు ఛైర్మన్, మూడు రైల్వే జోన్ల GMలు.. భక్తులు తమ ఇళ్లకు సజావుగా ప్రయాణించేలా చూసుకుంటున్నారని చెప్పారు. సంగమ్ స్నానం కోసం వచ్చిన భక్తులందరూ అధికారుల  సూచనలను పాటించాలని  కోరారు. రైల్వే అధికారుల సూచనల ప్రకారం ప్రజలు ఆయా రైల్వే స్టేషన్లలో రైళ్లు ఎక్కాలన్నారు.


ఒకే రోజు 364 ప్రత్యేక రైళ్లు

మౌని అమావాస్య నాడు,  నార్త్ సెంట్రల్ రైల్వే 280 రైళ్లను నడిపింది.  నార్త్ ఈస్టర్న్ రైల్వే 73 రైళ్లను, నార్తర్న్ రైల్వే 88 రైళ్లను నడిపింది. నార్త్ సెంట్రల్ రైల్వే అత్యధికంగా 157 మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడిపింది. ఉత్తర రైల్వే 28, ఈశాన్య రైల్వే 37 రైళ్లను నడిపింది. భక్తులు తమ ఇళ్లకు సురక్షితంగా, సౌకర్యవంతంగా తిరిగి వెళ్లేలా భారతీయ రైల్వే సంస్థ ఒకే రోజు 364 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Read Also: భారతీయ రైల్వేలో విద్యుదీకరణకు 100 ఏండ్లు, ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో శతాబ్ది ఉత్సవాలు!

కుంభమేళా కోసం 13 రైళ్లు కేటాయింపు

ఇక మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే సంస్థ సుమారు 13,450 రైళ్లను షెడ్యూల్ చేసింది. వీటిలో 10,028 సాధారణ రైళ్లు కాగా, 3,400 పైగా ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు, 1,900 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అన్ని రైళ్లను ప్రణాళిక ప్రకారం నడుపుతున్నట్లు వెల్లడించారు. గతంలో కొన్ని రైళ్లకు సంబంధించి  రూట్లను మార్చినట్లు తెలిపారు.  కొన్ని రైళ్ల టెర్మినల్ స్టేషన్‌ను ప్రయాగరాజ్‌కు బదులుగా సుబేదార్‌ గంజ్‌ కి మార్చినట్లు వెల్లడించారు.

Read Also:  ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాలు, టాప్ 10లో భారత్ ఏ ప్లేస్ లో ఉందంటే?

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×