OTT Movie : డబ్బు చుట్టూ పరిగెడుతున్న మనుషులకి, రోబోలకి పెద్దగా తేడా లేకుండా పోయింది. కాటికి పోయే వయసులో కూడా డబ్బులు గురించి ఆలోచిస్తున్నారు. అసలు జీవితం ఏమిటో మర్చిపోయారు మనుషులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని ఒకసారి చూస్తే, జీవితంలో కాస్తయినా సేద తీరుతారు. ఎడారిలో నీటికి ఎంత విలువ ఉంటుందో, చీకటిలో వెలుగుకి కూడా అంతే విలువ ఉంటుంది. అయితే ఇప్పుడున్న మనుషులు డబ్బులోనే విలువ ఉంటుందని, అసలు జీవితం మర్చిపోతున్నారు. మంచి మెస్సేజ్ ఇచ్చే ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ గుజరాతీ అడ్వెంచర్ మూవీ పేరు ‘రేవ‘ (Reva). బ్రెయిన్‌బాక్స్ స్టూడియోస్, బరోడా టాకీస్ నిర్మించిన ఈ మూవీలో చేతన్ ధనాని, మోనాల్ గజ్జర్ నటించారు. ఈ మూవీకి రాహుల్ భోలే, వినిత్ కనోజియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ గుజరాతీలో ఉత్తమ చలనచిత్రంగా, జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
కరణ్ డబ్బులు బాగా ఖర్చు చేస్తూ జల్సాలకు అలవాటు పడిపోతాడు. తన తాత డబ్బులు బాగా సంపాదించడంతో, వాటిని ఖర్చు చేస్తూ ఉంటాడు. అయితే కొద్ది రోజులకు తాత చనిపోతాడు. తాత రాసిన వీలునామాని చూసి కరన్ షాక్ అవుతాడు. ఆ వీలునామాలో ఆస్తి మొత్తం ఒక అనాధ శరణాలయానికి రాసి ఉంటాడు. అయితే ఆస్తిని కరణ్ పొందాలంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలని కూడా రాసి ఉంటుంది. అలా తన ఆస్తిని యన్ ఓ సి పేపర్ల మీద అనాధ శరణాలయం నిర్వహిస్తున్న వారి సంతకాలు తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక సుప్రియ అనే అమ్మాయి కూడా పరిచయం అవుతుంది. ఆమెను కరణ్ ఇష్టపడటం మొదలు పెడతాడు. అలా వారితో సంతకాలు చేపించుకునే పనిలో కూడా ఉంటాడు. అక్కడ పరిగ్రమ అనే ఒక యాత్ర గురించి తెలుసుకుంటాడు. అక్కడ ఉన్న నది పుట్టుక దగ్గరికి వెళ్లి, మళ్లీ తిరిగి వస్తుంటారు. ఈ ప్రయాణం ఒంటరిగా చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే కరణ్ ఒక అనాధ అని కూడా తెలుసుకుంటాడు. అయితే ఈ విషయం కరణ్ తాత అతనికి చెప్పకుండా దాచిపెడతాడు. అసలు తల్లిదండ్రులు ఎవరో చెప్పకుండానే చనిపోతాడు. ఇప్పుడు విషయం తెలుసుకున్న కరణ్ ఆస్తి మీద ఆశ పోతుంది. ఆ నది వెంట ఒంటరి ప్రయాణం మొదలు పెట్టి జీవితం గురించి తెలుసుకుంటాడు. చివరికి కరణ్ ఆస్తిని దక్కించుకుంటాడా? ప్రజలకు సహాయం చేయడం మొదలు పెడతాడా ? తన జీవితం గురించి అసలు ఏం తెలుసుకుంటాడు? ఈ విషయాలు తెలియాలంటే ‘రేవ’ (Reva) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనుషులం అన్న విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది.