Kayadu Lohar:కయాదు లోహర్ (Kayadu Lohar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు కుర్రకారు క్రష్ గా మారిపోయిన కయాదు లోహర్ ‘అల్లూరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా హిట్ కొట్టడంతో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా కెరియర్ కి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంది. అందులో భాగంగానే ఒకప్పుడు తనకు ఛాన్స్ ఇస్తామని చెప్పి.. పట్టించుకోని వారు ఇప్పుడు మళ్లీ ఛాన్స్ ఇస్తామని వెంటపడుతున్నారు అంటూ చెబుతోంది.
Sonu Sood: సోనుసూద్ భార్యకు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు వెంటపడుతున్నారు..
కయాదు లోహర్ మాట్లాడుతూ.. ” నేను మధ్యతరగతి కుటుంబం నుంచీ వచ్చాను. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కన్నాను. ఇక నటన నేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాను. డ్రాగన్ కి ముందు వరకు ఎన్నో సినిమాలు చేశాను. కానీ గుర్తింపు రాలేదు. కాని ఈ ఒక్క సినిమాతో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి ముందు ఎవరు నన్ను గుర్తించేవారు కాదు.. ఎప్పుడైతే ఈ సినిమా సక్సెస్ అయిందో ప్రతి ఒక్కరు తమతో సినిమా చేయాలని నిర్మాతలు కూడా అడుగుతున్నారు. ఇప్పటికిప్పుడే ఇంత క్రేజ్ వస్తుందని అనుకోలేదు. ప్రేక్షకుల ప్రేమను పొందడంలో ఆ అనుభూతే వేరు” అని తెలిపింది కయాదు.
చెన్నైలోనే ఉండిపోవాలనిపిస్తోంది – కయాదు లోహార్
6 సంవత్సరాల వయసులోనే నేను స్టేజిపై ‘దిల్సే’మూవీలోని “చెయ్య చెయ్యా” పాటకు డాన్స్ చేశాను. ముఖ్యంగా మాధురి దీక్షిత్ (Madhuri Dixit), శ్రీదేవి(Sridevi ) సినిమాలు చూస్తూ పెరిగాను. కాలేజ్ ఉన్నప్పుడు సెలవుల సీజన్ కావడంతో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 లో పాల్గొనమని అమ్మ చెప్పడంతో ఆ పోటీలో పాల్గొని గెలిచాను కూడా.. దాంతో ఒక ప్రకటన కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. అందులో నటించాక కన్నడ చిత్రం ‘ముగిల్ పేట’లో అవకాశం లభించింది. ఇక ఈ డ్రాగన్ సినిమాలో ముందుగా కీర్తి (Anupama Parameswaran) పాత్ర కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. ఇక కథ చెప్పి నెల రోజులైనా ఏం చెప్పకపోయేసరికి ఇక ఈ ఛాన్స్ రాదనుకున్నాను. కానీ ఆ తర్వాత డైరెక్టర్ నన్ను కలిసి కీర్తి పాత్ర కాకుండా పల్లవి పాత్ర చేయమని కోరారు. కానీ ఈ పాత్ర నా కెరియర్లో ఊహించిన దానికంటే మంచి స్పందన లభించింది. పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా సరే సినిమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ భాషల్లో సినిమాలు చేశాను. ముఖ్యంగా సౌత్ లో మిగతా భాషలతో పోల్చుకుంటే మలయాళం చాలా కష్టం. నేను పూణేలో పెట్టి పెరిగాను. మా అమ్మ నాన్నలది అస్సాం. అయినా సరే నాకు చెన్నైలోనే ఉండాలని ఉంది” అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ . మొత్తానికైతే అప్పుడు గుర్తింపు లేదని ఇప్పుడు అవకాశాలు మాత్రం వచ్చి పడుతున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.