BigTV English

OTT Movie : దయ్యాల హాస్పిటల్ లో సైకో డాక్టర్ … గులాబ్ జామ్ లు వణికించే మూవీ బ్రో

OTT Movie : దయ్యాల హాస్పిటల్ లో సైకో డాక్టర్ … గులాబ్ జామ్ లు వణికించే మూవీ బ్రో

OTT Movie : హారర్ సినిమాలను చూడటానికి ఇష్టపడుతుంటారు మూవీ లవర్స్. వీటిని చూసి భయపడుతూ ఎంటర్టైన్ అవుతుంటారు. అయితే ఇండోనేషియన్ హారర్ సినిమాలు కాస్త వైలెంట్ గానే ఉంటాయి.ఇవి కొంచెం ఎక్కువగానే భయపెడతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఇండోనేషియా నుంచి వచ్చింది. ఇందులో ఒక సైతాన్ కొంతమందిని ఆవహించి ఇబ్బందులకు గురిచేస్తుంది. దానిని ఎదుర్కొనే సన్నివేశాలతో స్టోరీ నడుస్తుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


Just watch లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లెంబయుంగ్’ (Lambayung). 2024 లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి బైమ్ వాంగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పికా అనే నర్సింగ్ విద్యార్థి రాసిన ‘Jin Poli Gigi’ ఆధారంగా తెరకెక్కింది. తస్క్య నమ్యా, యస్మిన్ జసెం, అన్నా జాబ్లింగ్ వంటి నటులు ఇందులో నటించారు. ఈ సినిమా ఇండోనేషియాలో మంచి కలెక్షన్స్ సాధించింది. 2024 సూపర్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ భయంకరమైన సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా, వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ జస్ట్ వాచ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

పికా, అరుమ్ అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. వారి ప్రాక్టికల్ ఫీల్డ్ వర్క్ కోసం, సెంట్రల్ జావాలో ఉన్న ఒక చిన్న క్లినిక్‌లో చేరతారు. అక్కడే ఈ దయ్యాల స్టోరీ మొదలవుతుంది. ఈ ఆసుపత్రిని ‘లెంబయుంగ్’ క్లినిక్‌గా పిలుస్తారు. ఇందులో గతంలో ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం వల్ల, కొంత కాలం దీనిని క్లోస్ చేస్తారు. ఇప్పుడు పికా, అరుమ్ అక్కడ పని చేస్తున్నప్పుడు, అరుమ్‌కి ఒక రోగి గురించి కలలు రావడం ప్రారంభమవుతాయి. క్లినిక్‌లోని కొంతమంది సిబ్బంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తారు. స్టోరీ ముందుకు సాగుతున్న కొద్దీ, అరుమ్‌పై ఒక ఆత్మ ఆవహించినట్లు తెలుస్తుంది. ఈ ఆత్మ బాత్‌రూంలో ఉరివేసుకుని చనిపోయిన ఒక మహిళదిగా అక్కడఉన్నవాళ్ళు అనుమానిస్తారు. అమె కూడా సైతాన్‌ ఆవహించిన తరువాతే చనిపోయి ఉంటుంది.

పికా తన స్నేహితురాలిని రక్షించడానికి, క్లినిక్ లో రహస్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇందుకోసం ఆమె ఇతరుల సహాయం కోసంవెతుకుతుంది. అప్పుడు పరిస్థితి మరింత చేయి జారిపోతూ ఉంటుంది. వీళ్లందరి జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయి. నిజానికి ఆ సైతాన్ వేరే ప్రపంచం నుంచి వచ్చి ఉంటుంది. అరుమ్ ని చూసి ప్రేమలో పడుతుంది. వీళ్ల ప్రయాణం ముందుకు సాగాలని, ఆ సైతాన్ ఆమెను ప్రెగ్నెంట్ ని కూడా చేస్తుంది. ఆ తరువాత ఇదంతా చేస్తుంది ఒక సైకో డాక్టర్ అని తెలుస్తుంది. చివరికి ఆ సైతాన్ బారినుంచి అరుమ్‌ తప్పించుకుంటుందా ? సైకో డాక్టర్ కి, సైతాన్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ‘లెంబయుంగ్’ (Lambayung) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×