BigTV English

Nindu Noorella Saavasam Serial Today January 30th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   అంజును హాస్పిటల్‌కు తీసుకెళ్లిన రణవీర్‌ – నిజం తెలుసుకున్న మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today January 30th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   అంజును హాస్పిటల్‌కు తీసుకెళ్లిన రణవీర్‌ – నిజం తెలుసుకున్న మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode : ఆరును పక్కకు తీసుకెళ్లమని యముడు గుప్తకు చెప్పగానే సరేనని ఆరును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు గుప్త. వాళ్లు వెళ్లిపోయాక మనం చేసిన తప్పిదం ఆ బాలికకు తెలిస్తే ఇంకేమైనా ఉన్నదా అని భయపడతాడు యముడు. దీంతో చిత్రగుప్తుడు పాపుల చిట్టా నా దగ్గరే ఉంది కదా..? అందులో ఆ బాలిక నాలుగు తప్పిందములు చేసిందని రాస్తాను అంటాడు. యముడు కోపంగా ఆ బాలిక ఆ విషయం పసిగడితే మన పరిస్థితి ఏంటి ఇదే నరకంలో మనం కూడా శిక్ష అనుభవించాలి అంటాడు యముడు.


మరి ఇప్పుడేం చేయాలని చిత్రగుప్తుడు అడిగితే ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన చిత్రి విచిత్రగుప్తుడినే అడుగుదాం అని పిలుస్తారు. గుప్త రాగానే యముడు అనుమానంగా చూస్తుంటాడు. గుప్త భయంతో ఆ బాలికను రెచ్చగొట్టింది నేనే అని పసిగట్టారా ఏంటి ప్రభువు అని భయపడుతుటాడు. ఇంతలో చిత్రగుప్తుడు అదే విషయం అడగ్గానే.. గుప్త కంగారు పడతాడు. నేను ఆ పని ఎందుకు చేస్తాను అంటాడు. అయితే ఇప్పుడు ఆ బాలిక మా మాట వినుట వలెనన్నా ఏమీ చేయవలెను అని అడుగుతాడు యముడు. ఆ బాలిక తన పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉన్నదని గమనించింది.

ఆ పిల్ల పిచ్చుకను కాపాడితే సరిపోతుంది అని చెప్తాడు గుప్త. అయితే ఇప్పుడే నేను భూలోకం వెళ్లాలా అని యముడు అడగ్గానే.. అవసరం లేదు ప్రభు ఆ బాలికను భూలోకం పంపినచో సరిపోతుంది అంటాడు గుప్త. దీంతో చిత్ర గుప్తుడు కోపంగా విచిత్ర నీకు మతి కానీ భ్రమించిందా..?  ఆ బాలికను భూలోకం నుంచి తీసుకుని వచ్చుటకు ఎంత కష్టపడ్డామో తెలిసి మళ్లీ భూలోకం పంపమని చెప్తున్నావా..? అంటాడు. దీంతో గుప్త ప్రభువుల వారు అడిగితిరి నేను చెప్పితిని అంటాడు. దీంతో యముడు సరే విచిత్ర నేను ఆలోచించుకుని చెప్తాను నువ్వు వెళ్లు అంటాడు. గుప్త ఆరు దగ్గరకు వెళ్లి ప్రభువుల వారు ఆలోచిస్తున్నారు అంటే నిన్ను పంపిస్తారని అర్థం అంటాడు గుప్త.


కింద వెజిటేబుల్స్‌ కట్‌ చేస్తున్న మిస్సమ్మ.. రణవీర్‌, మనోహరి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతోల శివరాం వచ్చి మిస్సమ్మ కొంచెం మంచినీళ్లు పట్టుకురా అంటాడు. మిస్సమ్మ  ఉలకదు.. పలకదు.. అనుమానంగా దగ్గరకు వెల్లిన శివరాం ఏంటి మిస్సమ్మ అలా ఉన్నావు అని అడుగుతాడు. మనోహరి, రణవీర్‌ గురించి మామయ్యా నాకెందుకో వాళ్లిద్దరూ కలిసి ఏదో ప్లాన్‌ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందుకే అంజును పంపాలంటే  భయమేసింది అని చెప్తుంది. ఇంతలో నిర్మల వచ్చి వాళ్లిద్దరు కలిసి ఏం ప్లాన్‌ చేస్తారు మిస్సమ్మ వాళ్లిద్దరూ ముందు నుంచి తెలిసివాళ్లు కాదు కదా..? అయినా నీకెందుకు అలా అనిపించింది మిస్సమ్మ అని అడుగుతుంది. దీంతో మనోహరి, రణవీర్‌ సైగ చేసుకోవడం.. ఇద్దరూ ఒకర్ని ఒకరు ముందే కలిశామని చెప్పడం కంగారు పడటం లాంటివి చూస్తుంటే అనుమానం వచ్చింది అని చెప్తుంది మిస్సమ్మ.

అంజును తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిన రణవీర్‌ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అంజు అడుగుతుంది. నువ్వు ఇంతకు ముందు ఐస్‌క్రీమ్‌ తిన్నప్పుడు దగ్గావు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు. అయ్యో అంకుల్‌ ఐస్‌క్రీమ్‌ తింటే ఎవరైనా దగ్గుతారు అంటుంది అంజు. అది కాదు అంజు నీకు జలుబు కానీ జ్వరం కానీ వస్తే మళ్లీ నన్ను తిడతారు. ఐస్‌క్రీమ్‌ తిన్నందుకు నిన్ను తిడతారు అంటాడు రణవీర్‌. అయితే ఓకే అంటుంది అంజు. ఇంతలో మిస్సమ్మ, రణవీర్‌కు ఫోన్‌ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంది.  మాల్‌ లో ఉన్నామని అంజలి ఆడుకుంటుందని చెప్తుంటే రణవీర్‌ పక్కనుంచి ఒక వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ హాస్పిటల్‌ అడ్రస్‌ చెప్తాడు.

దీంతో మిస్సమ్మ అనుమానపడుతుంది. రణవీర్‌ కూడా మిస్సమ్మ విందేమోనని భయపడుతుంటాడు. ఫోన్‌ లో ఉన్న హాస్పిటల్ వెళ్లొస్తానని మిస్సమ్మ.. శివరాం, నిర్మలకు చెప్పి అక్కడి నుంచి వస్తుంది. అప్పుడే హాస్పిటల్‌కు వెళ్తుంది మనోహరి. అంజుకు కనిపించకుండా రణవీర్‌తో మాట్లాడాలి అనుకుంటుంది. ఇంతలో అంజు వాటర్‌ తాగడానికి బయటకు వెళ్తుంది. ఇదంతా పైన యమలోకంలో ఉన్న ఆరు మాయాపేటికలో చూస్తూ.. కంగారుపడుతుంది. అంజలిని తీసుకెళ్లిపోతారు గుప్త గారు అంటూ బాధపడుతుంది. దీంతో బిడ్డ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం ధర్మమే కదా బాలిక అంటాడు గుప్త. దీంతో ఆరు ఎమోషనల్‌గా గుప్తను తిడుతుంది. దీంతో నువ్వు మళ్లీ భూలోకం వెళ్లడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటాడు గుప్త. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పోలీస్ కంప్లైంట్.. ప్రణతి కోసం నిజం చెప్తాడా..?

GudiGantalu Today episode: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..

Nindu Noorella Saavasam Serial Today october 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌    

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Big Stories

×