BigTV English

Mrunal Takur: మృణాళ్ తన బాడీ గురించి అంత బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చిందేమిటి?

Mrunal Takur: మృణాళ్ తన బాడీ గురించి అంత బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చిందేమిటి?

Mrunal Thakur latest news(Tollywood celebrity news): సాధారణంగా ఆడవారు తమ బాడీ గురించి పబ్లిక్ గా మాట్లాడటానికి ఇష్టపడరు. పైగా తమ పర్సనల్ విషయాలను కూడా బహిర్గతం చేయరు. కానీ ఇందుకు విరుద్ధంగా టాలీవుడ్ నటి మృణాళ్ ఠాకూర్ తన థైస్ గురించి మాట్లాడింది. తన బాడీలో తన థైసే స్పెషల్ అట్రాక్షన్ అని అంటోంది మృణాళ్.ఇటీవల బికినీ డ్రెస్ లో యూత్ కి పిచ్చెక్కించేలా ఫోటో షూట్ లో కనిపించింది. ఇక నెటిజన్స్ ఆగుతారా? ఏదో ఒక కామెంట్ చెయ్యాలి కదా..మీ బాడీలో ఆ థైస్ అస్సలు బాగోలేదు. మరీ అంత లావుగా ఎందుకున్నాయి? కనీసం వాటిని తగ్గించుకుంటే బాగుంటుంది కదా అని ట్రోలింగులు మొదలెట్టేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి ట్రోలింగులపై స్పందించిన మృణాళ్ తన బాడీలో తనకు ఇష్టమైన పార్ట్స్ అవే అంటున్నారు.నాకు లేని ఇబ్బంది వాళ్లకేమిటి? పైగా నాలాగా థైస్ ఉండాలని కోరుకునేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువౌతోందని అంటున్నారు. కొందరు జిమ్ సెంటర్లకు వెళ్లి థైస్ ఎలా పెంచుకోవాలో..చూస్తున్నారని..ఈ విషయంలో తనని చాలా మంది సలహాలు కూడా అడుగుతుంటారని ట్రోలింగులు చేసేవారికి గట్టిగా బుద్ధి చెప్పారు.


హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్

టాలీవుడ్ లో పీరియాడిక్ మూవీ సీతారామంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మృణాళ్ ఠాకూర్. హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో సంప్రదాయ సుద్ధపూసిని గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. మృణాళ్ ను తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీ టైప్ హీరోయిన్ గానే చూస్తున్నారు తప్ప గ్లామర్ డాల్ గా మాత్రం ఒప్పుకోవడం లేదు. హీరోతో సమాన నిడివి ఉన్న పాత్రలే ఆమెను వరిస్తున్నాయి. సీతారామం మూవీలో ఏకంగా హీరోనే డామినేట్ చేసే పాత్ర పోషించింది. అలాగే హాయ్ నాన్న మూవీలోనూ తన కళ్ల ముందే ఉన్న భర్త, కొడుకును మర్చిపోయి వాళ్లతో స్నేహం చేసే క్యారెక్టర్ లో గొప్పగా నటించింది.


లవ్ లో పడిందా?

ఇక ఫ్యామిలీ స్టార్ మూవీలో వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్లగా విజయ్ దేవరకొండతో కలిసి నటించి అక్కడా మంచి మార్కులే కొట్టేసింది. కల్కి మూవీలో ఓ క్యామియో రూల్ చేసింది.ప్రస్తుతం మృణాళ్ కు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టులే వస్తున్నాయి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పేరున్న హీరోతో ఈమె లవ్ లో పడిందనే టాక్ వినిపిస్తోంది. అయితే మృణాళ్ ఈ విషయంలో ఏ రకంగానూ స్పందించడం లేదు

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×