Tollywood:గత కొన్ని సంవత్సరాల క్రితం తమ నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించిన సెలబ్రిటీలు.. ఇండస్ట్రీకి దూరమై అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంతమంది చేసింది ఒకటి రెండు చిత్రాలే అయినా ప్రేక్షకులలో మాత్రం చెరగని ముద్ర వేసుకుంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు నాగార్జున (Nagarjuna) నటించిన ‘సూపర్’ సినిమాలో నటించి, తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఒక ప్రముఖ బ్యూటీ.. చాలా కాలం తర్వాత మళ్లీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, కొన్ని ఆశ్చర్యకర విషయాలు పంచుకుంది. ఆమె ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
పెళ్లి చేసుకోవడానికి మొత్తం మార్చుకున్న హీరోయిన్..
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను వివాహం చేసుకుంటే, మరికొంతమంది తమ చిన్ననాటి స్నేహితులను పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో మతం మార్చుకున్న వారు కూడా ఉన్నారు కానీ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి తన మతాన్ని మార్చుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కొడుకును వివాహం చేసుకోవడానికి మతం మార్చుకొని అతడిని వివాహం చేసుకొని, ఇండస్ట్రీకి దూరం అయింది. ఆమె ఎవరో కాదు కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఆయేషా టాకియా (Ayesha takia). పూరీ జగన్నాథ్ (Poori Jagannath) దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna) హీరోగా, అనుష్క(Anushka ) హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం సూపర్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆయేషా. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిన ఈమె అక్కడే సినిమాలు చేసుకుంటూ కెరియర్ పీక్స్ లో ఉండగానే గుడ్ బాయ్ చెప్పేసింది. దాంతో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ప్రముఖ వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని 2009 లో వివాహం చేసుకున్న ఈమె,అతడిని పెళ్లి చేసుకోవడానికి మతాన్ని కూడా మార్చుకుందట. సమాజ్ వాద్ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కుమారుడే ఈ ఫర్హాన్ అజ్మీ. ఇతడు రెస్టారెంట్స్ బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 15 ఏళ్ల తర్వాత తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ..” నేను ఫర్హాన్ అజ్మీని ప్రేమించాను. మూడేళ్లు అతనితో డేటింగ్ కూడా చేశాను. అయితే అతడిని పెళ్లి చేసుకోవాలంటే మతం మారాల్సి ఉంటుంది. అందుకే మతాన్ని మార్చుకొని పెళ్లి చేసుకున్నాను” అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి సంగతులను చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా 15 ఏళ్ల తర్వాత తన వైవాహిక బంధం మొదలైనప్పుడు జరిగిన సంఘటనలను తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆయేషా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆయేషా టాకియా కెరియర్..
ఆయేషా టాకియా కెరియర్ విషయానికి వస్తే.. సూపర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. తొలిసారి కృష్ణవంశీ (Krishna Vamsi) హిందీ సినిమా టార్జాన్:ది వండర్ కార్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. 2004లో వచ్చిన ఈ సినిమా ఈమెకు ఫిలిం ఫేర్ ఉత్తమ డెబ్యూ పురస్కారాన్ని అందించింది. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమెకు ఉత్తమ నటిగా స్క్రీన్ పురస్కారాలు కూడా లభించాయి. ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్గా, టెలివిజన్ వ్యాఖ్యాతగా పేరు దక్కించుకున్న ఈమె, ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగా ,సినిమా నటిగా కూడా రాణించింది.