BigTV English

NoraFatehi : హీరోయిన్ మృతి అంటూ వార్తలు.. కానీ చనిపోయింది ఎవరంటే..?

NoraFatehi : హీరోయిన్ మృతి అంటూ వార్తలు.. కానీ చనిపోయింది ఎవరంటే..?

NoraFatehi : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని వార్తలు నిజాలైతే మరికొన్ని వార్తలు వాస్తవాలు అయితే.. మరికొన్ని వార్తలు మాత్రం అవాస్తవాలు.. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ చనిపోయింది అంటూ నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి. బంగీ జంప్ చేస్తూ ప్రమాదవశాత్తూ తాడు తెగిపోవడంతో ఆమె లోతైన లోయలోకి పడిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ అవుతోంది.. ఈ వీడియోని చూసిన ఆమె అభిమానులు అదంతా నిజమే అనుకోని షాక్ అవుతున్నారు అసలు అలా ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఫేక్ వీడియోని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరి అక్కడ చనిపోయింది ఎవరు అనే విషయం గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆ బంగి జంప్ లో చనిపోయింది ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ఇండస్ట్రీలో ఫేక్ డెత్ రూమర్ల బారిన పడిన హీరోయిన్ మరెవరో కాదు ఇటీవల వరుణ్ తేజ్ మట్కాలో ఓ కీలక పాత్ర పోషించిన నోరా ఫతేహి. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పిస్తోన్న ఈ హాట్ బ్యూటి మృతి చెందిందంటూ ఓ ఇన్ స్టా గ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఆ వీడియోలో హీరోయిన్ నోరా పతేహి బంగి జంప్ చేయడానికి పైనుంచి దూకిందని, అయితే రోప్ తెగిపోవడంతో ఆమె లోయలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని నకిలీ ఫోటోలు జత చేసి షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నోరా అభిమానులు, బంధువులు టెన్షన్ పడ్డారు. నిజంగానే ఆమె చనిపోయిందా అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..

అయితే అందుతున్న సమాచారం ప్రకారం నోరా పతేహీ క్షేమంగానే ఉన్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వైరల్ అవుతోన్న వీడియో కల్పితమని క్లారిటీ వచ్చింది. బంగీ జంప్ చేస్తూ మృతి చెందిన మహిళ,నోరా ఫతేహి కాదని తేలింది. దాంతో నోరా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వీడియో చూసిన అభిమానులు మాత్రం ఫేక్ వీడియో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకి ట్యాగ్ చేస్తున్నారు.. అయితే ఆ బంగీ జంప్ చేసింది. బెంగుళూరుకు చెందిన ఓ టెకీ అని సమాచారం.. ఇలా ఫేక్ న్యూస్ లతో అభిమానులను టెన్షన్ పడుతున్న వాళ్లని కఠినంగా శిక్షించాలని పోలీసులను అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఇక నోరా సినిమాల విషయానికొస్తే.. టెంపర్, బాహుబలి ది బిగినింగ్, కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర ల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక ఇటీవల వరుణ్ తేజ్ మట్కా మూవీలో కీలక పాత్రలో నటించింది ఆ సినిమా యావరేజ్ గా ఆడుకోవడంతో అమ్మడుకు పేరేమి రాలేదు. బాలీవుడ్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.. అలాగే తెలుగులో మరో రెండు ప్రాజెక్టులలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రెండు కూడా స్టార్ హీరోల సినిమాలవడంతో ఆమెకు మంచి లైఫ్ ఉంటుందని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.


Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×