Tollywood Heroine : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు గా ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలతో సక్సెస్ అవుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి తమ నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి సినిమాల్లో హీరోయిన్లు గా ఛాన్స్ లు కొట్టేస్తున్నారు.. మొదటి సినిమాతో భారీ సక్సెస్ టాక్ ను అందుకుంటున్నారు. ఆ సినిమా తర్వాత వరుసగా హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అలాంటి క్రేజీ హీరోయిన్లలో ఒకరు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల.. ఒకవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతూ మరోవైపు సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈమె సినిమాల్లోకి రావడానికి చాలా కష్ట పడిందట.. కానీ సొంతవాళ్ళ మాటల వల్ల నిరాశ పడిందట.. హీరోయిన్ గా రాణించడం వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది..
హీరోయిన్ గా గ్లామర్ కంటే యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తున్న అనన్య.. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రంతో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ లీడ్ రోల్ లో నటించిన మూవీ క్రిస్మస్ కానుకగా రీసెంట్ గా విడుదలైంది. అయితే మేకర్స్ రీసెంట్ గా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో అనన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఇండస్ట్రీ ఎంట్రీ సమయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు అయ్యింది. మల్లేషం మూవీ మంచి టాక్ ను అందించింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పింది.. ఇక సినిమాల్లోకి వచ్చినప్పుడు తన పేరెంట్స్ రియాక్షన్ ఎప్పటికి మర్చిపోలేనని చెప్పింది..
మల్లేషం మూవీ చేసినప్పుడు ఇంట్లో చెప్పలేదని, షూటింగ్ అయ్యాక మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందున్న టైమ్ లో రెండు నెలల ముందు చెప్పానని అన్నారు. ఆ సమయంలో అమ్మ చాలా గొడవ పెట్టినట్లు తెలిపారు.. ఆ తర్వాత సొంత వాళ్ళు, రిలేటివ్స్ అమ్మను నానా రకాలుగా అన్నారు. ఆ మాటలు ఇంకా మర్చిపోలేకున్నా అని ఆమె గుర్తు చేసుకున్నారు. అందుకే ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలని.. అందుకు చాలా టై చేస్తున్నాను. మల్లేశం తర్వాత నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని అన్నారు. అనన్య ఇప్పటివరకు మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్, తంత్ర, పొట్టేల్.. వంటి సినిమాలు చేసింది. ఇక భారీ విజయాన్ని అందుకొనే రేంజులో సినిమాలు లేవని ఒక్క హిట్ పడితే లైఫ్ టర్న్ అవుతుందని ఆశ పడుతుంది. ఆమె జీవితంలో అందరిని ఎదురించి పడ్డ కష్టాలు మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నా అంటున్నారు..