
Diwali Movies 2023 : సంక్రాంతి ,దసరా తర్వాత తెలుగునాట అంత క్రేజ్ ఉన్న మరొక ఫెస్టివల్ దీపావళి. ముఖ్యంగా సినీ లవర్స్ కు కొత్త సినిమాలు ట్రీట్ ఇచ్చే సందర్భం ఇది. అయితే ఈసారి టాలీవుడ్ వాళ్లు దసరా, సంక్రాంతి కాన్సన్ట్రేట్ చేసినంతగా దీపావళిని పట్టించుకోలేదు. కనీసం ఒక్క ఆదికేశవ అయినా విడుదలవుతుంది అనుకుంటే దాన్ని కూడా వాయిదా వేశారు. పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి, దసరాకి సందడి చేస్తే మిడ్రేంజ్ హీరోలు దీపావళి ధమాకాగా దూసుకు వచ్చేవాళ్ళు.
అయితే ఈసారి టాలీవుడ్లో దీపావళికి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. బయట నుంచి వచ్చిన మూడు సినిమాలు ధమాకా రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి అనుకుంటే అంతంత మాత్రం పర్ఫామెన్స్ తో సరిపెట్టుకున్నాయి . దీంతో సిని లవర్స్ బాగా నిరాశ చెందారు. కనీసం ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కానీ దీపావళి ఈ సంవత్సరమే చూస్తున్నాం. మరోపక్క దీపావళి సందర్భంగా వచ్చిన క్రేజీ డబ్బింగ్ చిత్రాలు.. 1000 వాలా ధమాకా ఇస్తాయి అనుకుంటే.. పాము బిల్లల్లా తుస్సుమన్నాయి.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన కార్తీ జపాన్ .. క్లిక్ అయితే స్ట్రెయిట్ సినిమాల తరహాలో ఆడి ఉండేది. ఇది కార్తీ మైల్ స్టోన్ 25 వ మూవీ.. కథలు ఎంపిక విషయంలో ఎంతో డిఫరెంట్ గా ఉండే కార్తీ నుంచి ఇట్లాంటి సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి సినిమా చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. మొదటి షో తోనే ‘జపాన్’ డిజాస్టర్ అని కన్ఫర్మ్ అయింది. ఇక మరొక తమిళ్ డబ్బింగ్ మూవీ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ కాస్త బెటర్ గా ఉన్న లాస్ట్ అరగంట మాజిక్ కోసం రెండున్నర గంటల రాడ్ మూవీ ని భరించడం కష్టమనే చెప్పాలి. ఈ మూవీ తమిళ్లో పర్వాలేదు అనిపించుకున్న తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక మిగిలింది కండల వీరుడు సల్మాన్ ఖాన్ టైగర్ 3. ఏక్ థా టైగర్ ఫ్రాంచైజ్ లో వచ్చిన మూడవ స్పై చిత్రం ఇది. మిగిలిన రెండు చిత్రాల మాదిరిగా ఇది కూడా భారీ సక్సెస్ సాధిస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సినిమాకి రెస్పాన్స్ పరవాలేదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం మీద పండగ, వీకెండ్ ,సెలవులు.. మోస్తారు కంటెంట్ ఉన్న కొత్త హీరో సినిమా అయినా ఇలాంటి పరిస్థితుల్లో బాగానే ఆడుతుంది. కానీ దీపావళికి వచ్చిన మూడు డబ్బింగ్ చిత్రాలు పెద్దగా క్లిక్ అవడం లేదు.