BigTV English

Prabhas:ప్రభాస్‌కి అస్వ‌స్థ‌త‌.. షూటింగ్ వాయిదా!

Prabhas:ప్రభాస్‌కి అస్వ‌స్థ‌త‌.. షూటింగ్ వాయిదా!

Prabhas:మ‌న టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో త్వ‌ర‌లోనే జ‌ర‌గాల్సిన ఆయ‌న షూటింగ్ షెడ్యూల్ వాయిదా ప‌డ్డట్టు స‌మాచారం. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకెళ్తే..
బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటిన ప్ర‌భాస్ ఇప్ప‌డు మూడు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌లార్‌’ సినిమా చేస్తున్నారు. మ‌రో వైపు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు ప్ర‌భాస్‌.


ఇవి కాకుండా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అస‌లు మారుతి సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న అయితే లేనే లేదు. కానీ.. సినిమా మాత్రం సైలెంట్‌గా పూర్త‌వుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా షెడ్యూల్ ప్లానింగ్ అంతా జ‌రిగిపోయింది. అయితే ప్ర‌భాస్‌కి జ్వ‌రం రావ‌టంతో డాక్ట‌ర్స్ ఆయ‌న‌కి రెస్ట్ సూచించారు. మ‌రో మార్గం లేకుండా ప్ర‌భాస్‌, మారుతి సినిమా కొత్త షెడ్యూల్ ఆగింది.

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. స‌లార్ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాదిలోనే మారుతి సినిమా కూడా రిలీజ్ అవుతుంద‌ని అంటున్నాయి సినీ స‌ర్కిల్స్‌. ప్రాజెక్ట్ కె మాత్రం వ‌చ్చే ఏడాదిలోనే ఉంటుంద‌ని స‌మాచారం.


ఈ మూడు సినిమాలను శరవేగంగానే పూర్తి చేస్తూ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్‌తో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతుంది. అలాగే ప్రభాస్ 25వ సినిమా ‘స్పిరిట్’ కోసం సందీప్ వంగా వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×