BigTV English

Kiara Advani, Sidharth Malhotra : వైభవంగా కియారా , సిద్ధార్థ్‌ మ్యారేజ్.. సారీ చెప్పిన ఉపాసన..

Kiara Advani, Sidharth Malhotra : వైభవంగా కియారా , సిద్ధార్థ్‌ మ్యారేజ్.. సారీ చెప్పిన ఉపాసన..

Kiara Advani, Sidharth Malhotra : బాలీవుడ్ ప్రేమ జంట సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అడ్వాణీల వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యఘర్‌ ప్యాలస్‌ లో పెళ్లి వేడుక నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి వివాహానికి కరణ్‌ జోహార్‌, షాహిద్‌ కపూర్‌, జూహీ చావ్లా హాజరయ్యారు. అంతకుముందు ప్రీ వెడ్డింగ్‌ ఫంక్షన్స్‌ ఈ నెల 5, 6న సందడి సందడిగా జరిగాయి.


షేర్షా’ సినిమాలో కలిసిన నటించిన సిద్ధార్థ్‌, కియారా కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ పెళ్లి పీటల వైపు నడిపించింది. కియారా తెలుగులో ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.

బాలీవుడ్‌ సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిర్మాత కరణ్‌ జోహార్ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘‘పదిన్నరేళ్ల క్రితం సిద్ధార్థ్‌ ను కలిశాను. తనెంతో సైలెంట్‌, స్ట్రాంగ్‌, సున్నితమైనవాడు. కొన్నేళ్ల తర్వాత కియారాతో నాకు పరిచయమైంది. సిద్ధార్థ్‌లో ఎలాంటి లక్షణాలు చూశానో కియారాలో అవే కనిపించాయి. ఈ ఇద్దరు కలిసి అద్భుతమైన ప్రేమకథను సృష్టించగలరని ఆ రోజే అనుకున్నాను. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటైన ఈ క్షణాలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ శాశ్వతంగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని కరణ్‌ పోస్ట్ చేశారు. రామ్‌చరణ్‌, అలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, తమన్నా, రష్మిక, సమంత, విక్కీ కౌశల్‌ ఇలా చాలామంది సినీ సెలబ్రిటీలు కొత్త జంటకు విషెస్‌ చెప్పారు.


కియారా అడ్వాణీకి రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సారీ చెప్పారు. పెళ్లికి హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. కియారా తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘కంగ్రాట్స్‌ కియారా. మీ జోడీ చూడచక్కగా ఉంది. పెళ్లికి హాజరు కాలేకపోయినందుకు సారీ. మీ ఇద్దరికీ మరోసారి నా అభినందనలు’’ అని ఉపాసన కామెంట్‌ చేశారు.

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×