BigTV English

Naga Vamsi: బాలీవుడ్ అనలిస్ట్ కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ కౌంటర్..?

Naga Vamsi: బాలీవుడ్ అనలిస్ట్ కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ కౌంటర్..?

Naga Vamsi: గుంటూరు కారం, టిల్కూ స్క్వేర్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు రూపొందించిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ గురించి అందరికి తెలిసిందే. ఈయన ప్రొడ్యూసర్ గానే కాదు. డిస్టిబ్యూటర్ గా కూడా పని చేస్తున్నాడు. తాజాగా ఈయన బాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. అతడు ఈ మధ్య గలాటా ప్లస్ రౌండ్ టేబుల్లో బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాపై మాట్లాడుతూ.. సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కాస్త ఘాటుగానే మాట్లాడాడు.. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మరో ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


గలాటా ప్లస్ రౌండ్ టేబుల్లో టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశీతో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, పలు ఇతర ఇండస్ట్రీలకు చెందిన వ్యక్తులు కూడా పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ను తలదన్నేలా సౌత్ నుంచి పలు సినిమాలు రావడంతో హిందీ సినిమాల గురించి కాస్త కఠినంగానే మాట్లాడాడు. తెలుగు సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్నాయని ఘాటుగా స్పందించారు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తాకు ఆగ్రహం తెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ నిర్మాతలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు తప్పుగా అనలేదు. సీనియర్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ సర్, సురేష్ బాబు ఇలాగే వాళ్ల ముఖాలపైకి వేలెత్తి చూపుతూ మాట్లాడేంత దమ్ము అతనికి ఉందా? విజయం కంటే ముందు గౌరవానికి విలువ ఇవ్వడం నేర్చుకో. మేము గొప్ప సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల నుంచి వినయం, క్రమశిక్షణనే నేర్చుకున్నాం. ఇలాంటి చండాలమైన ప్రవర్తన వాళ్ల నుంచి ఎప్పుడూ ఊహించలేదు. విజయం కంటే ముందు గౌరవానికి విలువ ఇవ్వడం నేర్చుకో. మేము గొప్ప సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల నుంచి వినయం, క్రమశిక్షణనే నేర్చుకున్నాం. ఇలాంటి చండాలమైన ప్రవర్తన వాళ్ల నుంచి ఎప్పుడూ ఊహించలేదు” అని సంజయ్ అన్నాడు. అంటూ నాగ వంశీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అందులో ప్రస్తుతం ఇది సోషల్ మీడియా వార్ జరుగుతుంది..

నాగ వంశీ మాట్లాడుతూ.. మీరు ఒక విషయం మాత్రం అంగీకరించాలి. ఇది మీకు కాస్త కఠినంగానే అనిపిస్తుండొచ్చు. మా సౌత్ ఇండియన్స్ మీరు సినిమా చూసే విధానాన్ని మార్చేలా చేశాం. ఎందుకంటే మీరు బాంద్రా, జుహు కోసమే సినిమాలు తీస్తూ ఉండిపోయారు.. తెలుగులో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. కనీసం వాటిని రీచ్ అయ్యేలా మీరు మారాలి అన్నట్లు మాట్లాడారు. దానికి బోణి కపూర్ స్పందించారు. తెలుగు సినిమానే అందరికీ ఎలా సినిమాలు తీయాలో నేర్పించిందనేలా మాట్లాడటం సరి కాదని బోనీ అన్నాడు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కూడా తాను అమితాబ్ బచ్చన్ కు అభిమాని అని మరోసారి గుర్తు చేశాడు.


ఇదిలా ఉండగా తాజాగా నాగ వంశీ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో..బాలీవుడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ.. పెద్దలను ఎలా గౌరవించాలో మీరు మాకు నేర్పాల్సిన అవసరం లేదు, మేము మీ కంటే బోనీ జీని గౌరవిస్తాము ఇక్కడ మాట్లాడింది కేవలం సినిమాల గురించే.. బోని కపూర్ ను తప్పుగా మాట్లాడాలని కాదు.. చాలా ప్రశాంతంగా జరిగిన ఒక చర్చ మాత్రమే. నేను మరియు బోనీ జీ చక్కగా నవ్వుకున్నాము, ప్రతి ఒక్కరినీ కౌగిలించుకున్నాము ఇంటర్వ్యూ తర్వాత ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.. ప్రస్తుతం నాగ వంశీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని పై బాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి..

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×