BigTV English

MP Tejasvi Surya: ఎంపీ రాఘవ చద్దా బాటలో బీజేపీ ఎంపీ తేజస్వి, సింగర్‌తో పెళ్లి.. మారుతున్న ట్రెండ్

MP Tejasvi Surya: ఎంపీ రాఘవ చద్దా బాటలో బీజేపీ ఎంపీ తేజస్వి, సింగర్‌తో పెళ్లి.. మారుతున్న ట్రెండ్

MP Tejasvi Surya: మ్యారేజ్ విషయంలో యువతీ యువకుల అభిరుచులు మారుతున్నాయా? దేశంలో అమ్మాయిల కొరత వెంటాడుతోందా? ఒకప్పుడు రాజకీయ నేతలు.. ఆ తరహా నేతలతో వియ్య మందుకునేవారు. ఇప్పుడు ఎంపీలు సైతం గ్లామర్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులనే మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన.. జరుగుతున్న మ్యారేజ్‌లే ఇందుకు ఎగ్జాంఫుల్.


దేశంలో అన్ని కమ్యూనిటీల్లో అమ్మాయిల కొరత వెంటాడుతోంది. దీని కారణంగా పెళ్లి కాని ప్రసాదులు క్రమంగా పెరిగిపోతున్నారు. నార్తిండియాలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. పరిస్థితి గమనించిన పలువురు బిజినెస్‌మేన్లు సౌత్‌కి చెందిన హీరోయిన్లను పెళ్లి చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇటీవలకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది.

ఒకప్పుడు అబ్బాయిలు నచ్చిన అమ్మాయిలను ఎంపిక చేసుకునేవారు. ట్రెండ్ మారింది.. ఇప్పుడు అమ్మాయిలు.. నచ్చిన అబ్బాయిలను ఎంపిక చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 35 ఏళ్లు దాటిగా చాలామంది ప్రసాదులకు పెళ్లి ఘడియలు రావడం లేదు. ఈ క్రమంలో అబ్బాయిల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు సొసైటీలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి కూడా.


కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇందుకు ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే మార్చి 24న మ్యారేజ్ జరగనుంది.

ALSO READ: ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష, ఏమైంది?

ఎంపీ తేజస్వి సూర్య గురించి చిన్న ఇంట్రడక్షన్. దేశంలో అతి చిన్న వయస్సులో ఎంపీ అయిన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగుళూరు దక్షిణ లోక్‌సభ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తేజస్వి స్పీచ్ సైతం ప్రధాని నరేంద్రమోదీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే. మోదీ 3.0 కేబినెట్‌లో మంత్రిగా ఆయనకు ఛాన్స్ ఇస్తారంటూ ప్రచారం సాగింది కూడా.

సింగర్ శివశ్రీ విషయానికొద్దాం.. మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్‌ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పట్టా పొందారు. పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 2 కు కన్నడ వెర్షన్‌లో ఓ పాటకు శివశ్రీ తన గాత్రాన్ని అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు శివశ్రీకి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాదాపు 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల కూడా ఉంది.

ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గతేడాది బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు కొద్దిమంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఏదైనా పబ్లిక్ ఈవెంట్లకు ఈ జంట కలిసే మీడియా ముందు దర్శినమిస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు ఎంపీ రాఘవచద్దా బాటలో ఎంపీ తేజశ్వి సూర్య అడుగులు వేస్తున్నారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైపోయింది. రేపటి రోజున ఈ ఎంపీల ఇద్దరి బాటలో ఇంకెంత మంది నడుస్తారో వెయిట్ అండ్ సీ.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×