Tollywood Singer: టాలీవుడ్ హీరోలు ఇండస్ట్రీలోని పలువురితో స్నేహంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హీరోలు కొందరితో సన్నిహితంగా ఉంటూ వారితో మంచి బందాన్ని కొనసాగిస్తారు. హీరో హీరో మాత్రమే కాదు హీరోలు సింగర్స్ కూడా ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలోని తమ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి బయట పెడుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలోని ప్రముఖ సింగర్ హీరో తన ఫ్రెండ్ అన్న విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు ఒకప్పుడు పోలీసులకి అడ్డంగా బుక్ చేసిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఆ సింగర్ మరి ఎవరో కాదు రఘు కుంచే.. ఆయన బుక్ చేసిన హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రఘు కుంచె ఇంటర్వ్యూ..
టాలీవుడ్ సింగర్ రఘు కుంచె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన గొంతుతో ఎన్నో పాటల అందించి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక సింగర్ గా మాత్రమే కాదు నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా పలు సినిమాలకు పని చేస్తున్నారు. ఆయన వాడిన ఎందుకే రమణమ్మ పాట ఇప్పటికీ ఫంక్షన్లలో వినిపిస్తూనే ఉంటుంది. మొన్న ఈ మధ్య వచ్చిన నాది నక్లెస్ గొలుసు పాట కూడా బాగా ఫేమస్ అయింది. సింగర్ గానే కాకుండా హీరోలకు మంచి సన్నిహితుడుగా కూడా రఘుకుంచే ఉంటారు. ఇండస్ట్రీలోని ఎంతోమంది హీరోలు రఘుకుంఛే గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఇటీవల రఘు కొంచెం ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన అందరితో సన్నిహితంగా ఉంటాడని అదే ఆయనకు ఒకసారి కొంపముంచే పని చేసిందంటూ ఒక షాకింగ్ న్యూస్ ని బయటపెట్టారు. ఓ సందర్భంలో హీరో రవితేజ తో బైక్ మీద బయటకు వెళ్ళినప్పుడు. రవితేజ హెల్మెట్ పెట్టుకోకుండా ఉండడంతో పోలీసులత నాపీ పట్టుకున్నారు. ఆ సందర్భంలో ఆ బైకు తనది కాదని నాది అని అడ్డంగా బుక్ చేశాడంటూ ఆ ఇంటర్వ్యూలోబయట పెట్టాడు. ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో రవితేజ పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నీ మీదకొస్తే నువ్వు ఇలా తప్పించుకుంటావా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఆ ఇంటర్వ్యూ వీడియో మరింత వైరల్ అవుతుంది..
Also Read : పక్కనే నలగదు.. అది నలగడం కష్టమే.. ఫైమా బూ**..
రవి తేజ మూవీస్..
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలను చేసుకుంటూ ఇప్పటికీ బిజీగా ఉన్నారు. అయితే ఈమధ్య హిట్ ప్లాపుల తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.. ఈమధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. 76, 77వ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి లోపల ఆ సినిమాలు రిలీజ్ అవుతాయని తెలుస్తుంది. మరి ఆ సినిమాలు అన్న అతనికి సక్సెస్ అందిస్తాయేమో చూడాలి..