BigTV English

Krishna : భువి నుంచి దివికి సూపర్ స్టార్ కృష్ణ..ఆత్మీయులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు

Krishna : భువి నుంచి దివికి సూపర్ స్టార్ కృష్ణ..ఆత్మీయులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు

Krishna : సూపర్ స్టార్ కృష్ణ శాశ్వతంగా దూరమయ్యారు. భువి నుంచి దివికి వెళ్లిపోయారు. కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కృష్ణ భౌతికకాయం వద్ద పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. అనంతరం అంతిమసంస్కారాలు పూర్తి చేశారు.


పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్ర
అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియో నుంచి ప్రారంభమైంది. కృష్ణ పార్థివదేహం వద్ద పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఆత్మీయులు, అభిమానులు భారీగా తరలివచ్చి తమ అభిమాన కథానాయకుడికి తుది వీడ్కోలు పలికారు.

సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. తొలుత నానక్ రాంగూడాలోని నివాసంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచారు. అక్కడకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చి సూపర్ స్టార్ కు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం నానక్ రాంగూడా నుంచి పద్మాలయా స్టూడియోకు కృష్ణ పార్థీవదేహాన్ని తరలించారు. అక్కడ తెలంగాణ గవర్నర్ తమిళసై సూపర్ స్టార్ కు పుష్పాంజలి ఘటించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. కృష్ణ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబును సీఎం జగన్ ఓదార్చారు. కృష్ణ కుటుంబ సభ్యులను బాలకృష్ణ కుటుంబ సభ్యులు పరామర్శించారు. మహేష్ బాబును ఆలింగనం చేసుకుని కోట శ్రీనివాసరావు భావోద్వేగానికి గురయ్యారు. అలీ ,జయప్రద, అల్లు అరవింద్, రోజా, పలువులు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకు నివాళులు అర్పించారు.


తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చి కృష్ణ పార్థీవదేహానికి అంజలి ఘటించారు. అంతిమయాత్రలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. మహాప్రస్థానంలో కృష్ణ కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది ప్రముఖులను అనుమతించారు. అక్కడే సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను పూర్తి చేశారు.

Related News

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×