BigTV English
Advertisement

Director Teja : డైరెక్టర్ తేజ రియల్ లైఫ్ లో అన్ని కష్టాలే.. పదేళ్ల వయసులోనే అవమానాలు..

Director Teja : డైరెక్టర్ తేజ రియల్ లైఫ్ లో అన్ని కష్టాలే.. పదేళ్ల వయసులోనే అవమానాలు..

Director Teja : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో తేజ ఒకరు.. ఈయన తెరకేక్కించిన సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీ లోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన అది కొద్ది రోజుల్లోనే ఈయన స్టార్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి జనాల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. చిత్రం, నువ్వు నేను, జయం, నేనే రాజు నేనే మంత్రి లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.. ఆ మూవీలకు ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు టీవీలలో ఆ సినిమాలు వస్తుంటే జనాలు ఎగబడి చూస్తున్నారు అంతగా సినిమాలు క్రేజ్ ను అందుకున్నాయి. సినిమాల పరంగా డైరెక్టర్గా సత్తాను చాటిన తేజ రియల్ లైఫ్ లో అన్ని కష్టాలే అని చాలామందికి తెలియదు. చిన్న వయసులోనే ఆయన కష్టాలను దిగి మంగు కొని ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. డైరెక్టర్ తేజ రియల్ లైఫ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


డైరెక్టర్ తేజా రియల్ లైఫ్..

తెలుగు స్టార్ డైరెక్టర్ తేజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇప్పుడున్న డైరెక్టర్ అయితే ఆయన వెనకాల ఎన్నో ఆస్తులు కూడా పెట్టాడు. అలాంటి ఆయన ఒకప్పుడు రోడ్లు పట్టుకొని తిరిగాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఈ విషయాలను బయటపెట్టారు. చిన్నప్పటి జీవితం గురించి తెలుసుకుంటే కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతటి ఎమోషన్ దాగి ఉంది. తన తండ్రి ఆస్తులున్న వ్యక్తి, తల్లి విద్యావంతురాలు. కార్లలో లగ్జరీ లైఫ్. కానీ విధి వక్రించింది.. అతి చిన్నవయసులోనే తండ్రి దూరమయ్యాడు.. తేజా మాట్లాడుతూ.. నాకు ఒక చెల్లి, అక్క ఉన్నారు.. నాన్న చనిపోవడంతో సర్వం కోల్పోయమని చెప్పాడు. అమ్మ నాకు ఊహ తెలియని రోజుల్లోనే చనిపోయారు. ఇక ముగ్గురు ఒంటరిగా మారినట్లు తెలిపారు. నాన్నగారు ఉన్నప్పటికీ ఆస్తులు ఎలా పోయాయో తెలీదు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు సపరేట్ కార్. నా అక్కా చెల్లెళ్లకు ఒక్కక్కరికి ఒక్కో కార్ ఉండేది. మా ఫ్యామిలీ ఆస్తులు ఎన్ని అంటే.. ఫోటోల్లోనే పెద్ద పెద్దబిల్డింగులు కనిపించేవి..


అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా చిన్నాన్నలు మమ్మల్ని తలా ఒకరు పంచుకున్నారు. అంట్లు తోమాను. కుక్క ఉంటే దానికి స్నానాలు, ఇంట్లో క్లీన్ చేయడం అన్నీ చేసాను. చదువు సరిగా సాగలేదు.. ఏడో క్లాస్ వరకూ ఏ క్లాస్ చదివేవాడినో తెలీదు. బంధువుల ఇంట్లో భారం కాకుండా ఉండాలని నాకు తోచిన పనిని చేస్తూ కార్లు కడుగుతూ వాళ్లకి సాయంగా ఉన్నాను ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్లిపోయాను అక్కడ కెమెరా డిపార్ట్ మెంట్లో చేరాను. ఏడాది అనుభవం కోసం పని చేయమన్నారు. కొందరు ముందే చెప్పేవారు.. డబ్బులు ఇచ్చేవారు కాదు. అయితే పెద్ద అపార్ట్ మెంట్ దగ్గర కార్లు తుడిచి బ్రతికాను.. షూటింగులు ఉంటే, మూడు పూట్ల తినేవాడిని.. ఎక్కువ తింటుంటే పట్టేకుసునేవాళ్లు.. తర్వాత కెమెరామేన్ కి ఈ విషయాలు తెలిసి ఆయన ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అలా ముందుగా కెమెరామెన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ తర్వాత దర్శకుడుగా మారాను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండానే బాగానే సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నానని తేజ చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయనపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..

ఇక ఆయన సినిమాల విషయానికొస్తే ఈమధ్య కొత్త సినిమాలు ప్రకటించినట్లు తెలియలేదు.. త్వరలోనే మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×