BigTV English

SS Rajamouli : ఛీ ఛీ… మొత్తం నాశనం చేస్తున్నారు… వాళ్లపై జక్కన్న తీవ్ర అసహనం

SS Rajamouli : ఛీ ఛీ… మొత్తం నాశనం చేస్తున్నారు… వాళ్లపై జక్కన్న తీవ్ర అసహనం

SS Rajamouli : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా భారతీయ సినిమాలోనే దిగ్గజ దర్శకుడుగా పేరు సాధించి భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు ఎస్ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి కెరియర్ లో ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ప్రతి సినిమాకు తన స్థాయిని పెంచుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా తీసుకెళ్లి శిఖరం మీద కూర్చోబెట్టాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అంటే కారణం ఎస్ ఎస్ రాజమౌళి అని డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఒక సినిమా తీయడానికి ఎక్కువ టైం తీసుకున్న కూడా ఆ సినిమా కూడా అలానే గుర్తుండిపోతుంది అని చెప్పొచ్చు. రాజమౌళి సినిమాతో మన తెలుగు హీరోలకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం అనేది గర్వకారణం.


ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులపాటు చేశారు. మహేష్ బాబు (Mahesh Babu) కెరియర్ లో వస్తున్న 29వ (SSMB29) సినిమా ఇది. ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఒడిశాలో జరిగిన సందర్భంగా ఎస్.ఎస్ రాజమౌళి ఒడిస్సా లోని ఒక ఎత్తైన కొండను సందర్శించిన విషయాన్ని ట్విట్టర్ వేదిక షేర్ చేశారు.”ఒడిశాలోని ఎత్తైన మరియు అత్యంత అద్భుతమైన శిఖరం అయిన డియోమాలికి అద్భుతమైన సోలో ట్రెక్కింగ్ చేశాను. పై నుండి చూసే దృశ్యం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. అయితే, చెత్తతో చెదిరిపోయిన బాటను చూడటం నిరాశపరిచింది. అలాంటి సహజమైన అద్భుతాలకు ఇంకా మంచి అర్హత ఉంది. కొంచెం జ్ఞానం ఉంటే చాలా తేడా వస్తుంది… ఈ ప్రదేశాలను రక్షించడానికి ప్రతి సందర్శకుడు తమ వ్యర్థాలను తిరిగి తీసుకెళ్లాలి”

Also Read : Empuraan: బాక్సాఫీస్ పై వార్ అనౌన్స్ చేసిన స్టీఫెన్ నిడుంపల్లి అకా అబ్రామ్ ఖురేషి


ఒక కొండ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అలానే తమతోపాటు ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం అనేది కామన్ గా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో తినేసిన తర్వాత చాలా పెద్ద పదార్థాలను ప్లాస్టిక్ వస్తువులను అక్కడే విడిచి పెడుతుంటారు. అది చూడడానికి అసహనంగా అనిపిస్తుంది. ఒక విధంగా ప్రకృతిని పాడుచేసినట్లు కూడా అవుతుంది. అయితే ఈ విషయంలో సందర్శకులను జాగ్రత్త పడమని ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెలిపారు. కొన్ని రోజుల క్రితమే ఒడిస్సా ప్రాంతపు ప్రజలకు ఎస్.ఎస్.రాజమౌళి కృతజ్ఞతలు తెలిపిన లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా మహేష్ బాబు కనిపిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×