Team India Cash prize: టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీ నజరానాను టీమిండియాకు ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఏకంగా రూ.58 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్లు వెల్లడించింది భారత నియంత్రణ మండలి. ఇటీవల న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో భారత్…. ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లకు శుభాక్షాంక్షలు చెబుతూనే…. ఏకంగా రూ.58 కోట్ల నగదు బహుమతిని ( Team India Cash prize) ఇస్తున్నట్లు వెల్లడించింది భారత నియంత్రణ మండలి. ఇక టీమిండియాకు ప్రకటించిన నజరానాపై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
Also Read: Mumbai Indians: ఐపీఎల్ 2025 కంటే ముందే ముంబైకి షాక్..ఇద్దరు ప్లేయర్లు దూరం ?
ఇది ఇలా ఉండగా…. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 tournament ) భాగంగా ఈ నెల 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand )జట్లు తలపడ్డాయి. ఇక ఈ సందర్భంగా న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… దుమ్ములేపింది. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ రాణించాడు. చివరలో కేఎల్ రాహుల్, జడేజా మ్యాచ్ ను ముగించేశారు. బౌండరీ కొట్టి.. టీమిండియాను గెలిపించాడు రవీంద్ర జడేజా. దీంతో… ఇప్పటి వరకు మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
ఇది ఇలా ఉండగా 2025 ఐసీసీ చాంపియన్ ట్రోఫీ విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో… రోహిత్ శర్మ సేనకు 2.24 మిలియన్ల డాలర్స్ ఇచ్చారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 20 కోట్లు టీమ్ ఇండియాకు దక్కింది. అలాగే రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు… 9.74 కోట్లు రావడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసిసి 20 కోట్లు ఇచ్చింది. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం టీమిండియా కు 58 కోట్లు ఇచ్చింది. అంటే… ఐసీసీ కంటే 38 కోట్లు ఎక్కువగానే ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). అంతే దీన్ని బట్టి చూస్తే.. ఐసీసీ కంటే బీసీసీఐ చాలా పవర్ ఫుల్ అని అర్థం అవుతుంది.
Also Read: IPL 2025: ఉప్పల్ స్టేడియం లోకి వెళ్లే వారికి అలర్ట్.. ఈ వస్తువులు తీసుకుపోతే చర్యలు తప్పవు!?
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
BCCI announces a whopping ₹58 crore cash reward for Team India after their Champions Trophy 2025 triumph! 🇮🇳💰🏆#RohitSharma #India #BCCI #ChampionsTrophy #Sportskeeda pic.twitter.com/lPlQ0ZmVJ2
— Sportskeeda (@Sportskeeda) March 20, 2025