BigTV English

Tollywood: ఆ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో చిరు కూడా భయపడిపోయాడు… కానీ, బాలయ్య రియల్ హీరో..

Tollywood: ఆ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో చిరు కూడా భయపడిపోయాడు… కానీ, బాలయ్య రియల్ హీరో..

Tollywood : సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కొన్ని సందర్భాల్లో ఊహించని పరిణామాలను ఎదుర్కొనే ఉంటారు.. వాటి గురించి కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ జీవితంలో తృటిలో తప్పిన ప్రమాదాల గురించి బయటపెడతారు. అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమ జీవితంలో జరిగిన అనుకొని సంఘటనల గురించి బయట పెడుతుంటారు. అయితే ఇప్పటివరకు చిన్న చిన్న సంఘటనలు మాత్రమే విని ఉంటారు కానీ ఇప్పుడు ఓ భయంకరమైన సంఘటన గురించి పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఫ్లైట్ గురించి తమ అనుభవాలను కొందరు సెలబ్రిటీలు షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఏ సెలబ్రిటీ ఏ దాని గురించి చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఫ్లైట్ జర్నీ గురించి సెలెబ్రేటిల స్పందన..

సినిమాలో నటించే వాళ్ళు పలు లొకేషన్లలోని షూటింగ్ స్పార్ట్ లకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే రోడ్డు జర్నీ కంటే ఎక్కువగా ఫ్లైట్ జర్నీలని ఇష్టపడుతుంటారు సెలబ్రిటీలు.. మొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు తమ అనుభవాలను పంచుకుంటారు. అలా ఇప్పుడు కొందరు సెలబ్రిటీలు ఫ్లైట్ జర్నీలో ఎదురైన భయానక సంఘటనల గురించి బయట పెట్టారు. ముందుగా ఓ ఈవెంట్లో శారదమ్మ మాట్లాడుతూ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చిన్న సమస్య ఏర్పడింది. ఒక మాటలో చెప్పాలంటే అదొక ఫ్లైట్ యాక్సిడెంట్. అయితే ఆ ఫ్లైట్లో చాలామంది ఉన్నారు. ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అందులో నాతో పాటి చిరంజీవి బాలయ్య కూడా ఉన్నారు అని ఆమె అన్నారు. చిరంజీవి కూడా భయపడుతూ ఉన్నాడు. కానీ బాలయ్య మాత్రం అస్సలు భయపడకుండా.. ‘‘ఏం లేదు ఏం జరగదు.. వాటర్ బాటిల్ తీసుకురండి. కార్ ఎక్కడ ఉందో చెప్పండి. మేము వెళ్ళిపోతాం’’ అని ధైర్యంగా ఉన్నాడు. అప్పుడు నాకు ధైర్యం అనిపించిందని ఆమె అన్నారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో బాలయ్యను చూసి భయం కూడా పారిపోవాల్సిందే అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


ఇక అదే విధంగా కమెడియన్ సుధాకర్ ఒకసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు యాక్సిడెంట్ జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఫ్లైట్ జర్నీ తర్వాత నేను చాలా రోజుల వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత ఫ్లైట్ ఆక్సిడెంట్ వల్ల నేను ఇంట్లో ఉన్నానని తెలుసుకొని భయపడిపోయాను. అప్పటినుంచి చాలా రోజులు అసలు విమానం ఎక్కాలంటేనే భయపడేవాన్ని.. డైరెక్టర్ మాత్రం ప్రతిసారి అలా జరుగుతుందా ఏంటి? అని నాకు ధైర్యం చెప్పడంతో అప్పటినుంచి మళ్లీ ఫ్లైట్ ఎక్కడం మొదలుపెట్టాను అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.. ఈ వీడియోలు పై కొందరు ప్రశంసలు కురిపిస్తే మరికొందరు మాత్రం అయ్యో పాపం అంటూ జాలి చూపిస్తూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే ఇవి చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక బాలయ్య, చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరికీ వయసు పెరుగుతున్న కూడా సినిమాల మీద ఇష్టం మాత్రం తగ్గలేదు. వయసులో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. బాలయ్య ఇటీవల డాకు మహరాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.. ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే చిరంజీవి డిసెంబర్ సినిమాలో నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×