Woman Blocks Door with all Her Might, Robbers flee in Punjab: ఇంట్లో దొంగలు పడ్డారు.. షాపులో దొంగలు పడ్డారు.. ఆఫీసులో దొంగలు పడ్డారు అనే మాటలను విరివిగా వింటుంటాం. కానీ, ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వీర వనిత ధైర్య సాహసాలు కనిపిస్తున్నాయి. దొంగతనానికి వచ్చిన దొంగలకు ఆమె చుక్కలు చూపించింది. మెల్లిగా ఇంట్లోకి చొరబడి అంతా దోచుకెళ్దామనుకున్నారు ఆ దొంగలు. కానీ, వారి రాకను పసిగట్టిన సదరు మహిళ వెంటనే అలర్ట్ అయ్యింది. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కతే తన పిల్లలతో కలిసి ఉంది. అయినా కూడా ఏ మాత్రం భయపడకుండా ఒంటి చేత్తో ఆమె ఆ దొంగలను ఇంట్లోకి రాకుండా చేసింది. ఇదంతా కూడా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సదరు మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: మనకు ‘దీపావళి’.. చైనాకు కారు చీకట్లు, ఆ నిర్ణయం ఊహించని దెబ్బకొట్టనుందా?
పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన జగ్జీత్ కౌర్ అనే జ్యువెల్లరీ వ్యాపారి పని నిమిత్తం గత సోమవారం సాయంత్రం ఇంటి బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు దొంగలు ఆ ఇంటికి వచ్చారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఉన్న నగలు, నగదు, విలువైన వస్తువులను దోచుకోవాలనుకున్నారు. కానీ, ఇంట్లో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న జగ్జీత్ కౌర్ భార్య మందీప్ కౌర్ వారి రాకను గమనించింది. వెంటనే ఆమె అలర్ట్ అయ్యింది. అక్కడి నుంచి పరిగెత్తి ఇంటి డోర్ ను మూసి వేసింది. అయినా కూడా ఆ దొంగలు డోర్ ను నెట్టి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఏ మాత్రం భయపడకుండా ఒక్కతే ఆ డోర్ ను గట్టిగా అలానే పట్టుకుంది. ఆ తరువాత అక్కడే ఉన్న సోఫాను డోర్ కు అడ్డంగా పెట్టింది. అనంతరం తన భర్తకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి వివరించింది. దీంతో చేసేదేమిలేక ఆ ముగ్గురు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
‘బట్టలను ఆరవేస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను మా ఇంటి వద్ద గమనించారు. వారు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారు. వారు గోడను ఎక్కి మా ఇంటి మెయిన్ డోర్ వద్దకు వచ్చారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి మెయిన్ డోర్ ను లాక్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ, అప్పటికే అక్కడికి వచ్చిన ఆ ముగ్గురు దొంగలు డోర్ ను నెట్టసాగారు. అయినా కూడా వారు ఇంట్లోకి రాకుండా నేను బలంగా ఆ డోర్ ను అలాగే పట్టుకున్నాను. ఆ సమయంలో నేను గట్టిగా అరిచాను. ఆ సమయంలో నేను, నా పిల్లలు చాలా భయపడ్డాం. వారిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలి’ అంటూ మందీప్ కౌర్ అన్నారు.
Also Read: కొడుకు పెళ్లికి అంబానీ వేల కోట్లు ఖర్చు పెట్టాడు.. అదంతా ప్రజల సొమ్ము : రాహుల్ గాంధీ
ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఆ దొంగలను పట్టుకుంటామంటూ స్థానికులు పోలీసులు పేర్కొన్నారు.