Young Heros : మన టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు చాలా బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోలైతే ఏ నిర్మాతకి కూడా 3 ఏళ్ళ తర్వాత కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు. మరోపక్క మిడ్ రేంజ్ హీరోలు కూడా రెండేళ్ళకి సరిపడా ప్రాజెక్టులకి సైన్ చేసి.. వాళ్ళు కూడా బిజీగా గడుపుతున్నారు.నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ వంటి మిడ్ రేంజ్ హీరోలంతా యమ బిజీగా గడుపుతున్నారు. దీంతో దర్శకులకి యంగ్ హీరోలు తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. విశ్వక్ సేన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది టాలెంటెడ్ & అప్ కమింగ్ దర్శకులకి.
‘ధమాకా’ తో రూ.100 కోట్ల దర్శకుల లిస్టులో చేరిన త్రినాధ్ రావ్ నక్కిన సైతం సందీప్ కిషన్ వంటి టైర్3 హీరోతో ‘మజాకా’ సినిమా చేయాల్సి వచ్చింది. దానికి టాక్ బాగానే వచ్చినా ఆడలేదు. అయితే త్రినాధ్ రావ్ ట్రాక్ రికార్డు బాగుండటంతో బిజినెస్ బాగానే చేయడంతో నిర్మాత సేఫ్ అయినట్టు ఇండస్ట్రీ టాక్. అలాగే సినిమాకి పెద్దగా బడ్జెట్ వంటివి పెట్టింది కూడా లేదు.రెండు ఇళ్ళు, బస్ స్టాప్, కాలేజ్ బయట తీసేశారు. సో టాప్ డైరెక్టర్ ఉంటే యంగ్ డైరెక్టర్ సినిమాని ఏదో ఒక రకంగా క్యాష్ చేసుకోవచ్చు.
అయితే నిర్మాతలు ఇప్పుడు యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి వస్తుంటే.. అదేదో వాళ్ళ క్రెడిబిలిటీ అన్నట్టు వాళ్ళు ఫీలవుతున్నారు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవును ఇటీవల ఏ యంగ్ హీరో దగ్గరకి దర్శకులు వెళ్లి కథలు చెబుతామన్నా.. ముందుగా ‘నిర్మాత ఉన్నాడా?’ అని అడుగుతున్నారట. ఒకవేళ నిర్మాత ఉన్నాడు అని మేనేజర్ కన్ఫర్మ్ చేస్తే.. ముందుగా పారితోషికాల లెక్కలు మాట్లాడమని మేనేజర్లకి చెప్పి… ఆ తర్వాత కథ చెప్పడానికి లోపలి పంపమని చెబుతున్నారట.
అక్కడితో అయిపోలేదు.. కథ విన్నాక వాళ్ళు కథలో ఏదో ఒక వంకలు చెప్పి ఫోన్ చేస్తాం అని చెబుతున్నారట. ఈలోపు నిర్మాత ‘హీరో ఒప్పుకోడేమో’ అని కంగారు పడి పారితోషికం ఎక్కువగా చెబుతాడు అనేది ఓ యంగ్ హీరో ప్లాన్. ఇంకో యంగ్ హీరో ఏమో.. స్క్రిప్ట్ లో తన టీం ఇన్వాల్వ్ అవుతుంది.. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాలి అని కండిషన్ పెడుతున్నారట. వీళ్ళకంటే హైలెట్ ఇంకో యంగ్ హీరో గురించి చెప్పాలి. ఆ యంగ్ హీరో పారితోషికం, కథ ఫైనల్ అయినా.. నిర్మాతలు బడ్జెట్ పెట్టడానికి తప్ప.. ఇక ఎందులోనూ జోక్యం చేసుకోకూడదు అనే కండిషన్ పెడుతున్నాడట.
ఇది అతని బంధువుతో చెప్పిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమా కొబ్బరి కాయ కొట్టే టైం నుండి గుమ్మడికాయ కొట్టేవరకు తన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండాలనే కండిషన్ పెడుతున్నాడట. సో ఇవి.. ఇప్పుడు యంగ్ హీరోలు(టైర్ 3) హీరోల హడావిడి ఇలా ఉంది. నిర్మాతలు మంచి కథలు ఈ యంగ్ హీరోలతో చేసి తమ ప్రొడక్షన్ ను ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే.. ఇదే ఛాన్స్ కదా అని వాళ్ళని నలిపేయడానికి చూస్తున్నట్టు అర్థంచేసుకోవచ్చు.