BigTV English

Govinda : జేమ్స్ కామెరూన్ కు టైటిల్ నేనే ఇచ్చాను… హీరోకి ఆ లోపం ఉందని ‘అవతార్’ ఛాన్స్ చేజార్చుకున్నాడట ఈ హీరో

Govinda : జేమ్స్ కామెరూన్ కు టైటిల్ నేనే ఇచ్చాను… హీరోకి ఆ లోపం ఉందని ‘అవతార్’ ఛాన్స్ చేజార్చుకున్నాడట ఈ హీరో

Govinda : గత కొన్ని రోజుల నుంచి తన భార్య సునీతతో విడాకుల రూమర్స్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద (Govinda). ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జేమ్స్ కామెరూన్ (James Cameron) కు ‘అవతార్’ (Avatar) అనే టైటిల్ ఇచ్చింది తానేనని, హీరోగా తననే అడగ్గా ఆ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేశానని చెప్పి షాక్ ఇచ్చాడు. మరి గోవిందా ఈ క్రేజీ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేశాడు? ‘అవతార్’ టైటిల్ వెనుక జరిగిన స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


‘అవతార్’ ఆఫర్ రిజెక్ట్ 

తాజా ఇంటర్వ్యూలో గోవింద మాట్లాడుతూ “నేను 20 కోట్ల ఆఫర్ ని వదిలేసాను. దాని వదిలేయడం చాలా బాధాకరం, కాబట్టి ఇప్పటికీ గుర్తుంది. గతంలో అమెరికాలో ఒక సర్దార్జీని కలిసాను. అతనికి నేను పనికొచ్చే ఒక బిజినెస్ ఐడియా ఇచ్చాను. కొన్నేళ్ల తర్వాత అతను నన్ను జేమ్స్ కామెరూన్ ను కలవమని అడిగాడు. అంతేకాదు ఆయనతో కలిసి సినిమా చేయమని రిక్వెస్ట్ చేశాడు. మూవీ డిస్కషన్ కోసం నేను వారిని విందుకు పిలిచాను. ఆ టైంలో నేను ఈ సినిమాకి అవతార్ అని టైటిల్ పెట్టాను. అయితే జేమ్స్ నాకు ఈ సినిమాలో హీరో వికలాంగుడు అని చెప్పాడు. అందుకే నేను ఆ సినిమా చేయనని చెప్పేశాను. నిజానికి అతను ఈ మూవీ కోసం నాకు 18 కోట్లు ఆఫర్ చేసి, 410 రోజుల షూటింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. నేను దానికి కూడా సరే అన్నాను. కానీ నా శరీరాన్ని పెయింట్ చేస్తే ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. మన శరీరం మాత్రమే మనకు ఉన్న ఏకైక ఆయుధం. కొన్నిసార్లు ఇలాంటి ఆఫర్లు చాలా టెంప్టింగ్ గా కనిపిస్తాయి. కానీ వాటి వల్ల శరీరం ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ముఖ్యమే. కానీ ఈ సినిమాకి నో చెప్పినందుకు సంవత్సరాల తరబడి నేను అభిమానులకు, నాకు సారీ చెప్తూనే ఉండాలి” అంటూ అవతార్ టైటిల్ వెనుక, ఆ మూవీని రిజెక్ట్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటో వెల్లడించారు. దీంతో గోవింద చెప్పిన స్టోరీ విన్న అభిమానులు ఇలాంటి క్రేజీ ఆఫర్ ని ఎలా వదులుకుంటారు అంటూ ఆశ్చర్యపోతున్నారు.


బిజినెస్ లో కోట్ల నష్టం

ఇక చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న గోవిందా బిజినెస్ లో కోట్లు నష్టపోయానని చెప్పుకొచ్చారు. 100 కోట్ల సినిమాను రిజెక్ట్ చేసినందుకు తాను బాధపడుతున్నానని చెప్పిన ఆయన, చిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. “నేను చదువు రాని వ్యక్తిని. చదువుకున్న వ్యక్తుల మధ్యకు వచ్చాను. కాబట్టి వారు నన్ను ఇండస్ట్రీ నుంచి పక్కన పెట్టేయాలని చూసారని అర్థమైంది. నేను వారి పేరుని చెడగొట్టాలని అనుకోవట్లేదు, కానీ నాపై కుట్రలు చేశారు’ అంటూ సొంతవాళ్లు సైతం తనను దూరం పెట్టారని ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా గతంలోని ఇంటర్వ్యూలో తాను డబ్బు పెట్టుబడి పెట్టి, దాదాపు 16 కోట్లు నష్టపోయానని వెల్లడించారు. ఇక గోవింద చివరిసారిగా 2019లో రిలీజ్ అయిన ‘రంగీలా రాజా’ అనే సినిమాలో నటించాడు. 6 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు తిరిగి బిగ్ స్క్రీన్ పై మెరవడానికి సిద్ధమవుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ మూడు సినిమాలు కూడా ఇదే ఏడాది రిలీజ్ కాబోతున్నాయని గోవిందా వెళ్లడించారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×