Hyderabad Destinations: విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే సమ్మర్ హాలీడేస్ రాబోతున్నాయి. టైమ్ ఉన్నవాళ్లు దేశంలోని పలు ప్రాంతాల్లోకి వెకేషన్ కు వెళ్తారు. టైమ్ లేనివాళ్లు ఒకే రోజులో టూర్ కు ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వారి కోసం హైదరాబాద్ తో పాటు పరిసరాల్లో మంచి డెస్టినేషన్స్ ఉన్నాయి. చక్కటి కొండలు, కోనలు మొదలు కొని చారిత్రక కట్టడాలు, అడ్వెంచరస్ ప్లేసెస్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు వెళ్లిరావచ్చు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇంతకీ హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
⦿ గోల్కొండ కోట
హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది గోల్కొండ కోట. 13వ శతాబ్దానికి చెందిన ఈ కోటకు ఎంతో చరిత్ర ఉన్నది. అద్భుతమైన నిర్మాణ శైలికి ఈ కోట నిదర్శనం. చక్కటి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ పద్దతులు ఆకట్టుకుంటాయి. ఈ కోటను సందర్శించడం చాలా అద్భుతంగా ఉంటుంది. కోటలోని వింతలు విశేషాలు ఆహా అనిపిస్తాయి. టాప్ కు వెళ్లి చూస్తే హైదరాబాద్ అందాలు ఆకట్టుకుంటాయి.
⦿ చార్మినార్, జూపార్క్
హైదరాబాద్ లోని చార్మినార్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ చారిత్రక కట్టడాన్ని చూసి రావచ్చు. పక్కనే ఉన్న లాడ్ బజార్ మట్టి గాజులకు చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చే చాలా మంది షాపింగ్ చేసుకోవచ్చు. అటు జూ పార్క్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పలు రకాల జంతువులు, పక్షులు, క్రూర మృగాలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
⦿ సాలార్జంగ్ మ్యూజియం
హైదరాబాద్ లోని మరో చూడదగిన ప్రదేశం సాలార్జంగ్ మ్యూజియం. ఎన్నో చారిత్రక, పురాతన ఆయుధాలు, శిల్పాలు, అరుదైన సామాగ్రితో నిండి ఉంటుంది. నిత్యం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని చూసేందుకు తరలి వస్తారు. ఇక్కడ గంటల గడియారం చాలా ఫేమస్.
⦿ రామోజీ ఫిల్మ్ సిటీ
మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఫిల్మ్ సిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 2,500 ఎకరాల్లో ఉన్న ఈ ఫిల్మ్ సిటీలో బోలెడు సెట్లు, గార్డెన్లు, థీమ్ పార్క్ అద్భుతంగా ఉంటాయి. ఒక్క రోజు టూర్ ప్లాన్ చేసుకునే వారికి బెస్ట్ డెస్టినేషన్ గా చెప్పుకోవచ్చు.
⦿ అనంతగిరి కొండలు
హైదరాబాద్ నుంచి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఎటు చూసిన అద్భుతమైన అడవులు, కొండలు, లోయలతో ఆకట్టుకుంటుంది. ప్రకృతి, ప్రశాంతతను ఇష్టపడే వారికి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. అనంతరిగి పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.
⦿ యాదరిగిగుట్ట
హైదరాబాద్ నుంచి సుమారు గంట ప్రయాణంలో యాదగిరిగుట్ట ఉంటుంది. ఇక్కడ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా కొనసాగుతోంది. ఒక్కరోజు టూర్ ప్లాన్ చేసే వారికి యాదగిరిగుట్ట బెస్ట్ డెస్టినేషన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: మహిళలూ.. సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్లేసెస్ ఇవే!
⦿ నాగార్జున సాగర్
హైదరాబాద్ నుంచి సుమారు 150 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డ్యామ్, వన్యప్రాణుల అరణ్యాలు కనువిందు చేస్తాయి. చుట్టుపక్కల కొండల యొక్క సుందరమైన దృశ్యాలు అలరిస్తాయి.
⦿ శ్రీశైలం
హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నల్లమల కొండలలో కొలువైన ఉన్న శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు.ఆలయం చుట్టూ ఉన్న కొండలు, అడవులు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
Read Also: మార్చి నెలలో డార్జిలింగ్ వెళ్లాలా? ఏమిటీ అంత ప్రత్యేకత?