Sundeep Kishan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరోకి తమ మూలాలు ఉంటాయి. ప్రస్తుతానికి హైదరాబాదులో సెటిల్ అయిపోయినా కూడా ఇప్పటికీ సొంత ఊర్లలో ఉన్న తమ బంధువులను పలకరిస్తూ ఉంటారు. అలానే సందీప్ కిషన్ కి కూడా వాళ్ళ నాన్న తరపు బంధువులు తో మంచి అనుబంధం ఉంది. సందీప్ కిషన్ నాన్నమ్మ ఆగ్నేశమ్మ చనిపోయారు. ఆగ్నేశమ్మ స్వయాన సందీప్ కిషన్ నాన్నకి అమ్మ. ఆగ్నేసమ్మ విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేశారు వృత్తిలో ఉన్న సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చదివించి, వారి అవసరాలు కూడా తీర్చారు.
అంత్యక్రియలు పూర్తి
ఆగ్నేసమ్మ మృతదేహాన్ని మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు పి ఆర్ పి నాయుడు. ప్రముఖ హీరో సందీప్ కిషన్ మద్రాసులో పెరిగినప్పటికీ, జ్ఞానాపురంలో తమ బంధువులతో మాట్లాడుతూనే ఉంటారు. తన నానమ్మ మరణవార్త విని శోకసముద్రంలోకి మునిగిపోయారు సందీప్ కిషన్. టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్, తన మేనమామ ఛోటా కె.నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వైజాగ్ చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు అంత్యక్రియలు పూర్తి చేశారు.
వరుస సినిమాలతో బిజీ
ఇక సందీప్ కిషన్ విషయానికొస్తే ముందుగా చిన్న చిన్న పాత్రలో కనిపించి తర్వాత హీరోగా కూడా నటించడం మొదలు పెట్టాడు. కొన్ని అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇక ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ విజయ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా మంచి పేరు సాధించుకున్నాడు. లోకేష్ కనకరాజ్ వంటి దర్శకులతో పనిచేసిన అనుభవం సందీప్ ఉంది.
Also Read : Manchu Vishnu: బన్నీ, రానా గ్రూప్ క్రియేట్ చేస్తే, మంచు విష్ణు ఎందుకు బయటకు వచ్చేసారు?