BigTV English

Amritha Aiyer: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హనుమాన్ బ్యూటీ.. ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం కాదట..

Amritha Aiyer: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హనుమాన్ బ్యూటీ.. ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం కాదట..

Amritha Aiyer: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేసింది. ప్రదీప్ మాచిరాజు నటించిన ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలో నటించింది. ఆ మూవీ ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. ఆ తర్వాత ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమాలో నటించింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో పాపకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక సోషల్ మీడియా లో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అంతేకాదు పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అస్సలు ఆమె మనసులోని మాట ఏంటో తెలుసుకుందాం..


ఈ అమ్మడు చాలా ఏళ్లుగా ఇండస్ట్రీ లో రానిస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన బిగిల్ సినిమాలో నటించింది.. ఆ మూవీలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ సరైన బ్రేక్ దొరకట్లేదు. ఆ తర్వాత తమిళ్ లో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ‘బచ్చలమల్లి’ మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. మూవీ రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండటం తో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్.. బచ్చలమల్లి’ ప్రమోషన్స్‌లో భాగంగా అమృత అయ్యర్‌కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు.. అందుకు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నాగ చైతన్య, కీర్తి సురేష్, శ్రీసింహా, ఇలా ఇండస్ట్రీలోని టాప్ హీరోహీరోయిన్లు చాలామంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహ చేసుకునేందుకు సిద్ధమే.. 2025 లో ఎప్పుడైన పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది.

అంతేకాదు.. ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోనని తేల్చి చెప్పింది. ఇండస్ట్రీకి అస్సలు సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి. బోర్ కొట్టకుండా మాట్లాడుకోవచ్చు.. కొత్త వాళ్ళు అని చెప్పింది. అంటే ప్రేమ వివాహం చేసుకుంటుందా? లేదా పెద్దలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా అనేది మాత్రం చెప్పలేదు.. అయితే మొత్తానికి వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతుందని చెప్పేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బచ్చలమల్లి సినిమా చేస్తుంది. ఆ తర్వాత మరో రెండు రెండు సినిమాలు చేస్తుంది. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కుతున్న జై హనుమాన్ సినిమాలో నటిస్తుంది..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×